ఆండ్రాయిడ్‌లో రాబోయే ఇంట్రస్టింగ్ ఫీచర్లివే..
రీసెంట్‌గా బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)’ ఈవెంట్‌లో గూగుల్.. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
రీసెంట్‌గా బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)’ ఈవెంట్‌లో గూగుల్.. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు గూగుల్ పేర్కొంది. ఆ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..
రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో గూగుల్ తమ ఏఐ టూల్‌ను ఇంటిగ్రేట్ చేయనుంది. గూగుల్ డెవలప్ చేసిన జెమినీ టూల్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. గూగుల్ మెసేజెస్‌కి ఈ టూల్ లింక్ చేశారు. అంటే ఏదైనా విషయాన్ని టెక్ట్స్ ఫార్మాట్‌లో టైప్ చేసి.. ఫొటోలు, వీడీయోల రూపంలో కన్వర్ట్ చేసి మెసేజ్‌లు పంపొచ్చు.
రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో గూగుల్ డాక్స్‌ను మరింత బెటర్‌గా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ డాక్స్‌లో చేతిరాత ద్వారా చిన్నచిన్న ఇన్‌పుట్స్ ఇస్తూ పూర్తి డాక్యుమెంట్‌ను రెడీ చేయొచ్చు. ఇంగ్లిష్ రైటింగ్ రాని వాళ్లు కూడా మెరుగైన డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు.
స్మార్ట్ ఫోన్‌ను కారుకి కనెక్ట్ చేసినప్పుడు వచ్చే ఇబ్బందులను సరిచేస్తూ గూగుల్ కొన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్‌ను కారుకి కనెక్ట్ చేసినప్పుడు ఏదైనా మెసేజ్ వస్తే డ్రైవింగ్‌కు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆటో రిప్లై లేదా ప్రీజనరేటెడ్ రిప్లైల వంటివి పంపొచ్చు. ప్రయాణాల్లో ఫోన్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు గూగుల్ కొన్ని ఏఐ బేస్డ్ టూల్స్‌ను డెవలప్ చేసింది.
ఇకపోతే అంధుల కోసం గూగుల్ మరిన్ని యాక్సెసబిలిటీ ఫీఛర్లను జత చేయనుంది. వారికోసం గూగుల్ ‘లుక్‌అవుట్’ పేరుతో కొత్త టూల్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో ఏదైనా ప్లేస్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రదేశాల వివరాలు, డైరెక్షన్ల వంటివి వాయిస్ ఓవర్ రూపంలో విని తెలుసుకోవచ్చు.
వీటితోపాటు లాక్ స్క్రీన్ నుంచి స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్‌ను ఆపరేట్ చేయడం వంటి ఫీచర్లు, కొన్ని ఇతర సెక్యూరిటీ ఫీచర్లను తీసుకురానుంది.