జులై నెలలో రాబోతున్న మొబైల్స్ ఇవే..

ఎప్పటిలాగానే వచ్చే జులై నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి బేసిక్ మోడల్స్ వరకూ రకరకాల మొబైల్స్ ఉన్నాయి.

Advertisement
Update:2024-06-30 07:00 IST

ఎప్పటిలాగానే వచ్చే జులై నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి బేసిక్ మోడల్స్ వరకూ రకరకాల మొబైల్స్ ఉన్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

నథింగ్ సీఎంఎఫ్ ఫోన్1 (Nothing CMF phone 1)

నథింగ్ ఫోన్ 1 ను రీడిజైన్ చేస్తూ సరికొత్త మోడల్‌ను లాంఛ్ చేయనుంది నథింగ్ సంస్థ. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో రెండు 50 ఎంపీ కెమెరాలతో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ ఎమ్ 35 (Samsung M35)

శాంసంగ్ నుంచి ‘ఎమ్ 35’ పేరుతో బడ్జెట్ మొబైల్ రాబోతోంది. ఈ మొబైల్ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 4 (Oneplus Nord4)

వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ నుంచి జులై నెలలో వన్‌ప్లస్ నార్డ్ 4 మొబైల్ రాబోతోంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.67 ఇంచెస్ 1.5కె అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 50 ఎంపీ లేదా 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మరో సెకండరీ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

రియల్‌మీ 13 సిరీస్ (Realme 13)

రియల్‌మీ నుంచి వచ్చే నెలలో ‘రియల్‌మీ 13’ సిరీస్ లాంఛ్ అవ్వబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా రియల్‌మీ 13, రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ మొబైల్స్ ఉంటాయి. ఇవి స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తాయి. 6.52 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఒప్పో రెనో 12 సిరీస్ (Oppo Reno 12)

ఒప్పో నుంచి కూడా వచ్చే నెలలో ‘రెనో 12’ సిరీస్ మొబైల్స్ లాంఛ్ అవ్వబోతున్నాయి. ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌‌పై పనిచెస్తాయి. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఒప్పో రెనో 12 ప్రో ప్లస్ మోడల్ క్వాడ్ కర్వ్‌డ్ స్క్రీన్‌తో రావొచ్చు. అలాగే వీటిలో 50 ఎంపీ లేదా 64 ఎంపీ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.

శాంసంగ్ ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6 (Samsung Fold 6 & Samsung Flip 6)

శాంసంగ్ నుంచి వచ్చే నెలలో రెండు ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. ‘శాంసంగ్ ఫోల్డ్ 6’ తో పాటు ‘శాంసంగ్ ఫ్లిప్ 6’ మొబైల్ కూడా రాబోతోంది. ఇవి స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ పై పనిచేస్తాయి. అడ్రినియో గ్రాఫిక్స్ చిప్ ఉంటుంది. ‘ఫోల్డ్ 6’ మొబైల్ 7.6 ఇంచెస్, ‘ఫ్లిప్ 6’ మొబైల్ 6.75 ఇంచెస్ డస్‌ప్లేతో ఉండొచ్చు. ‘ఫోల్డ్‌ 6’లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, ‘ఫ్లిప్‌ 6’లో 12 ఎంపీ ప్రైమరీ కెమెరాలుంటాయి.

Tags:    
Advertisement

Similar News