కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ ఫీచర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి!
సాధారణంగా రెండు లేదా మూడేళ్లకోసారి మొబైల్ మారుస్తుంటారు చాలామంది. అయితే కొత్తగా మొబైల్ కొంటున్నప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని తగిన ఫీచర్లు ఉంటున్నాయా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలి.
సాధారణంగా రెండు లేదా మూడేళ్లకోసారి మొబైల్ మారుస్తుంటారు చాలామంది. అయితే కొత్తగా మొబైల్ కొంటున్నప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని తగిన ఫీచర్లు ఉంటున్నాయా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలి.
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన ఫీచర్లు, ఆప్షన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ కొనేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం అందులోని ప్రాసెసర్. ఫోన్ ధరను నిర్ణయించేవాటిలో ప్రాసెసర్ ముఖ్యమైనది. ప్రస్తుతం మార్కెట్లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్, మీడియాటెక్, శాంసంగ్ ఎగ్జినోస్ వంటి పలు ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏయే ప్రాసెసర్ ఎంత ధరలో లభిస్తుందో తెలుసుకోవాలి. ఒకే ప్రాసెసర్‌ను వాడే మొబైల్స్ అన్నీ దాదాపుగా ఒకే ప్రైస్ రేంజ్‌లో ఉంటాయి. కాబట్టి తక్కువ ధరలో మంచి ప్రాసెసర్‌ను ఏ బ్రాండ్ అందిస్తుందో తెలసుకుని కొనుగోలు చేయాలి.
మొబైల్ కొనేముందు చెక్ చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం డిస్‌ప్లే. డిస్‌ప్లేల్లో ఎల్‌సీడీ, ఎల్‌ఈ డీ, అమోలెడ్.. ఇలా పలు రకాలున్నాయి. వీటిలో ఎల్‌ఈడీ, అమోలెడ్ డిస్‌ప్లేలు మంచి క్వాలిటీని కలిగి ఉంటాయి. అలాగే రిజల్యూషన్ విషయంలో హెచ్‌డీ, 2కె, 4కె వంటి పలు ఆప్షన్లు ఉంటాయి. తక్కువ ధరలలో ఎక్కువ రెజల్యూషన్, అమోలెడ్ స్క్రీన్ ఉండే మొబైల్ తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
ఫోన్‌లో చాలామంది ముఖ్యంగా భావించే మరో ఫీచర్ కెమెరా. కెమెరా విషయంలో మొబైల్ బ్రాండ్లు మోసాలు చేస్తుంటాయి. మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉంటే మంచి కెమెరా అన్నట్టు ప్రమోట్ చేస్తుంటాయి. కానీ, అందులో నిజం లేదు. ఫొటో క్వాలిటీ అనేది సెన్సర్ రకం, సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. ఉదాహరణకు చైనీస్ బ్రాండ్స్ మొబైల్స్‌లో 200 ఎంపీ కెమెరా కంటే శాంసంగ్ ఎస్ సిరీస్‌లోని 16 ఎంపీ కెమెరా బెటర్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. కాబట్టి కెమెరా విషయంలో గూగుల్‌లో ఆ కెమెరాతో తీసిన ఫొటోలను సెర్చ్ చేసి క్వాలిటీని చెక్ చేసుకుని తీసుకోవాలి.
మొబైల్‌లో చూసుకోవాల్సిన మరో విషయం బ్యాటరీ కెపాసిటీ. ఇది కనీసం 4000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటే ఇంకా మంచిది.
మొబైల్ లో స్టోరేజ్ అనేది కూడా కీలకం. ర్యామ్ కనీసం 4జీబీ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఇంటర్నల్ స్టోరేజీ 64 జీబీ లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు కనెక్టివిటీ, వారంటీ, సర్వీస్ సెంటర్స్ వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి.