వాట్సాప్‌కు పోటీగా ఎలన్‌మ‌స్క్ ఎక్స్‌.. ఆడియో వీడియో కాల్స్ చేయొచ్చు..!

ఎక్స్‌ యూజ‌ర్లు త‌మ బంధువులు, ఫాలోవ‌ర్లు, కాంటాక్ట్స్‌కు ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకునే ఆప్ష‌న్ అందుబాటులో ఉంది.

Advertisement
Update:2024-01-21 11:15 IST

WhatsApp-X | గ‌తంలో వీడియో కాల్ చేయాలంటే స్కైప్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చేది. ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం ఉంటేనే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. కానీ, ఇప్పుడు అత్యాధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అన్ని సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజ‌ర్లు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సౌల‌భ్యం ఉంది.

ఇప్పుడు ప్ర‌పంచ కుబేరుడు ఎల‌న్‌మ‌స్క్ సార‌ధ్యంలోని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌) కూడా వాట్సాప్‌కు పోటీగా వ‌స్తోంది. త‌న యూజ‌ర్ల‌కు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు తెచ్చింది. ప్ర‌స్తుతం ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. ప్ర‌స్తుతం ఎక్స్ ప్రీమియం స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫెసిలిటీ ల‌భిస్తున్న‌ది. కాక‌పోతే యూజ‌ర్లు త‌మ ఎక్స్‌ యాప్ అప్‌డేట్ చేసుకోవాల‌ని ఎక్స్ ఇంజినీర్ ఎన్రిక్యు తెలిపారు.

ఎక్స్‌ యూజ‌ర్లు త‌మ బంధువులు, ఫాలోవ‌ర్లు, కాంటాక్ట్స్‌కు ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకునే ఆప్ష‌న్ అందుబాటులో ఉంది. `ఎక్స్‌`లోని ఆడియో లేదా వీడియో కాల్స్ ఫీచ‌ర్‌ను ఎంబీడెడ్ చేసుకోవాలి. అటుపై ఈ చ‌ర్య‌లు ఫాలో అయితే వీడియో/ ఆడియో కాల్స్ చేసుకోవ‌చ్చు.

- ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎక్స్‌ ఓపెన్ చేయాలి.

- సైడ్‌బార్‌పై గ‌ల సెట్టింగ్స్ అండ్ ప్రైవ‌సీపై క్లిక్ చేయాలి.

- మ‌రిన్ని ఆప్ష‌న్ల కోసం ప్రైవ‌సీ అండ్ సేఫ్టీని స్క్రోల్‌డౌన్ చేయాలి.

- ఇప్పుడు డైరెక్ట్ మెసేజ్‌ల‌పై క్లిక్ చేయాలి.

- ఆడియో-వీడియో కాలింగ్ టాబ్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆడియో, వీడియో కాల్స్ ఫెసిలిటీ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లే.

ఆడియో లేదా వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను డీయాక్టివేట్ చేయాల‌న్నా, వినియోగించాల‌న్నా సెట్టింగ్స్ నేవిగేట్ చేయాలి. అటుపై ప్రైవ‌సీ అండ్ సేఫ్టీలోకి వెళ్లి చివ‌ర‌కు డైరెక్ట్ మెసేజ్‌ల్లోకి వెళ్లాలి. ఈ సెట్టింగ్స్‌లో ఆడియో లేదా వీడియో కాల్స్ చేయ‌డానికి మూడు ఆప్ష‌న్లు ఉంటాయి. యూజ‌ర్లు త‌మను ఫాలో అవుతున్న వారు, వెరిఫైడ్ యూజ‌ర్లు, అడ్ర‌స్ బుక్ ఆధారంగా త‌మ‌కు అవ‌స‌ర‌మైన ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. ఈ మూడు ఆప్ష‌న్ల‌లో ఒక‌టి కంటే ఎక్కువ ఆప్ష‌న్లు ఎంచుకునే ప్లెక్సిబిలిటీ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News