అమరావతిలో డ్రోన్‌ సమ్మిట్‌

ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహణ, లోగో ఆవిష్కరణ

Advertisement
Update:2024-10-06 15:59 IST

అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ కు సమ్మిట్‌ కు వేదిక కానుంది. అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ -2024 సమ్మిట్‌ లోగో, వెబ్‌ సైట్‌ ను ఏపీ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రా స్ట్రక్షర్‌ సెక్రటరీ సురేశ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి అమరావతిని డ్రోన్‌ క్యాపిటల్‌ మార్చాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ లో సీఎం డ్రోన్‌ సమ్మిట్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. డ్రోన్‌ టెక్నాలజీ దైనందిన జీవితంలో ఎదురవుతున్న సమస్యలతో పాలనలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. ఐఐటీ ముంబయి, మద్రాస్‌, తిరుపతి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. డ్రోన్‌ సమ్మిట్‌ కు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని, డ్రోన్‌ రంగంలో అనుభవమున్న సంస్థలకు సంబంధించిన 400 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 22న సాయంత్రం కృష్ణా నదీ తీరంలో 5వేల డ్రోన్స్‌ తో డ్రోన్‌ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ స‌మ్మిట్ సంద‌ర్భంగా ఔత్సాహికుల కోసం అమరావతి డ్రోన్ హ్యాక‌థాన్ నిర్వ‌హిస్తున్నామ‌ని ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఈ హ్యాక‌థాన్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. హ్యాక‌థాన్ లో గెలుపొందిన రూ. 3 ల‌క్ష‌లు, రూ. 2 ల‌క్ష‌లు, రూ. ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తులు అందిస్తామన్నారు. పాల్గొనే వారు ఈనెల 15లోగా https://amaravatidronesummit.com/లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News