ఫోన్‌లో ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ తెలుసా?
ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో రకరకాల సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే వాటికి తగినట్టు రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే మొబైల్‌ను ఎప్పుడూ సేఫ్‌గా ఉంచుకోవచ్చు.
ఎంతో విలువైన సమాచారాన్ని భద్రపరిచే మొబైల్‌ను సేఫ్‌గా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. దీనికోసం రకరకాల సెట్టింగ్స్ కూడా మార్చుకుంటుంటారు చాలామంది. అయితే చాలామందికి తెలియని మరికొన్ని ఇంట్రెస్టింగ్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా మొబైల్స్‌లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో రకరకాల సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే వాటికి తగినట్టు రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే మొబైల్‌ను ఎప్పుడూ సేఫ్‌గా ఉంచుకోవచ్చు. అదెలాగంటే..
మొబైల్ చేతిలో ఉంటేనే ఏ సెట్టింగ్ అయినా మార్చుకోవచ్చు. కానీ, అసలు ఫోనే లేకపోతే?! కాబట్టి ముందుగా మొబైల్‌ను పోగొట్టుకోకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. దీనికోసం ఫోన్‌లో ‘ఫైండ్ మై డివైజ్’ సెట్టింగ్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి. ఈ ఆప్షన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కనిపిస్తుంది. ఈ ఫీఛర్ కోసం ఫైండ్ మై డివైజ్ అనే గూగుల్ యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, దీనికి గూగుల్ అకౌంట్ లింక్ చేసినట్టయితే మొబైల్ పోయినప్పుడు వెబ్ ద్వారా మొబైల్‌ను లాక్ లేదా రింగ్ చేయొచ్చు. లొకేషన్ కూడా కనపెట్టొచ్చు.
మొబైల్ యూజర్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే.. మొబైల్ ఐఎంఈఐ నెంబర్‌ను జీమెయిల్‌లో లేదా పేపర్‌పై నోట్ చేసి ఉంచుకోవాలి. ‘*#06#’ కు కాల్ చేస్తే ఐఎంఈఐ నెంబర్ కనిపిస్తుంది. పోయిన మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
మొబైల్‌ను ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిపడుతుంటారు చాలామంది. ఇలాంటి ఇబ్బంది ఉండకూడదంటే మొబైల్‌లో సెకండరీ యూజర్ ప్రొఫైల్ లేదా సెకండ్ స్పేస్ వంటి ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఈ సెట్టింగ్ ఒక్కో ఫోన్‌లో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ సెట్టింగ్ ద్వారా మొబైల్‌లోని గూగుల్ అకౌంట్, ఫొటోస్, యాప్స్.. అన్నీ వేరేగా కనిపిస్తాయి. మీ వ్యక్తిగత డేటా కనిపించకుండా ఈ మల్టిపుల్ యూజర్స్ ఆప్షన్ పనికొస్తుంది.
మొబైల్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఉండే డేటా ఎన్‌క్రిప్షన్ అనే మరో ఆప్షన్ ద్వారా మీ డేటా దొంగల చేతికి చిక్కకుండా కాపాడుకోవచ్చు. ఈ మోడ్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌లోని మొత్తం డేటా చదవలేని విధంగా కోడ్స్ రూపంలో ఎన్‌క్రిప్ట్ అవుతుంది.
మొబైల్‌లోని ముఖ్యమైన డేటాని కాపాడుకునేందుకు బ్యాకప్ ఆప్షన్ కూడా పనికొస్తుంది. ఎప్పటికప్పుడు డేటాను ఆటో బ్యాకప్ చేస్తుండడం వల్ల మీ డేటా సేఫ్‌గా ఉంటుంది. కావాల్సినప్పుడు మీ డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు.