ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్లు తెలుసా?
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. యూత్ ఎక్కువగా వాడే ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలామందికి తెలియని రకరకాల యాక్సెసబిలిటీ ఫీచర్లున్నాయి.
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. యూత్ ఎక్కువగా వాడే ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలామందికి తెలియని రకరకాల యాక్సెసబిలిటీ ఫీచర్లున్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..
ఇన్‌స్టాగ్రామ్ అనేది ముఖ్యంగా ఫొటో, వీడియో ప్లాట్‌ఫామ్. అయితే ఇందులో లేటెస్ట్‌గా ‘నోట్స్’ అనే ఫీచర్ కూడా యాడ్ అయింది. యూజర్లు తమ ఆలోచనలను పంచుకోవడానికి షార్ట్ టెక్స్ట్ రూపంలో నోట్స్‌ను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఇన్‌బాక్స్ ట్యాబ్‌లో ప్రొఫైల్ పిక్ మీద కనిపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే కంటెంట్.. కేవలం ఒక స్పెసిఫిక్ గ్రూప్ మాత్రమే కనిపించాలనుకుంటే ‘గ్రూప్ ప్రొఫైల్’ అనే ఆప్షన్‌ను వాడుకోవచ్చు. ప్రొఫైల్ పేజీలో క్రియేట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే గ్రూప్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో మీకు నచ్చిన వారితోనే కంటెంట్ షేర్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమీ తోచనప్పుడు గేమ్ కూడా ఆడుకోవచ్చని మీకు తెలుసా? చాట్ బాక్స్‌లో ఎవరికైనా ఎమోజీ సెండ్ చేసి దాన్ని ట్యాప్ చేస్తే.. గేమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ గేమ్ ఆడుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పోస్ట్ కు కామెంట్లు రావొద్దనుకుంటే పోస్ట్ చేసేముందు అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే అవతలి వారికి కామెంట్ అనే ఆప్షన్ కనిపించదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరికైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని ఎడిట్ చేయొచ్చు కూడా. ఒకసారి పంపిన తర్వాత అందులో మార్పులు చేయడం కోసం మెసేజ్‌ను సెలెక్ట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. మెసేజ్ పంపిన పావుగంట లోపు ఐదు సార్లు ఇలా ఎడిట్ చేసే వీలుంటుంది.
ఇకపోతే ఇన్‌స్టా్గ్రామ్‌లో ఏదైనా పోస్ట్‌ను ఫలానా రోజు అప్‌లోడ్ చేయాలి అని ముందుగానే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘షెడ్యూల్’ ఆప్షన్‌పై ట్యాప్ చేస్తే డేట్, టైం కనిపిస్తాయి. అక్కడ పోస్ట్ టైప్ చేసి డైట్, టైం సెలక్ట్ చేసుకుంటే ఆ టైంకు ఆటోమేటిక్‌గా పోస్ట్ అప్‌లోడ్ అవుతుంది.
ఒకే రకమైన ఇంట్రస్ట్‌లు ఉన్నవారితో కనెక్ట్ అయ్యేందుకు ఇన్‌స్టాలో కొలాబరేటివ్ కలెక్షన్స్ అనే ఫీచర్ ఉంది. ముందుగా మీ పొస్ట్‌ను కలెక్షన్స్‌లో సేవ్ చేసి తర్వాత ట్యాగ్ పీపుల్‌పై ట్యాప్ చేసి ఇన్వైట్ కొలాబరేటర్‌పై క్లిక్ చేసి మీకు నచ్చినవారిని కలెక్షన్‌లో యాడ్ చేయొచ్చు.