యూట్యూబ్‌లో ఈ ఫీచర్లు తెలుసా?
మొబైల్‌లో వాడకం పెరిగాక యూట్యూబ్‌కు ఎనలేని పాపులారిటీ వచ్చింది
మొబైల్‌లో వాడకం పెరిగాక యూట్యూబ్‌కు ఎనలేని పాపులారిటీ వచ్చింది. ప్రతిఒక్కరూ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే ఉంటారు. అయితే ఈ యాప్‌ని సులభంగా వాడుకునేందుకు రకరకాల యాక్సెసబిలిటీ ఫీచర్లున్నాయని చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు ముందుకు వెళ్లాలంటే వీడియో మీద కుడివైపున రెండు సార్లు డబుల్ ట్యాప్ చేయాలని తెలిసిందే. అయితే అలా చేస్తే పది సెకండ్ల ముందుకు కదులుతుంది. అదే ఎడమయ వైపున ట్యాప్ చేస్తే వీడియో వెనక్కు వెళ్తుంది. అయితే అలా రెండు సార్లు కాకుండా తడుతూనే ఉంటే ఇంకాస్త ముందుకు, వెనక్కు పోతూనే ఉంటుంది. అలా నిముషాల పాటు ముందుకి, వెనక్కి వెళ్లొచ్చు. అంతేకాకుండా ట్యాప్ చేసినప్పుడు ముందుకు, వెనక్కు కదిలే సమయాన్నీ కూడా సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు. యూట్యూబ్ సెటింగ్స్‌లో ‘జనరల్’ ఆప్షన్‌లో ‘డబుల్ ట్యాప్ టు సీక్’ ను ఎంచుకుని అక్కడ టైం సెట్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ లో ఒక వీడియో చూసిన తర్వాత వెంటనే మరో వీడియో దానంతటదే ప్లే అవుతుంటుంది. అయితే ఇలా వరుసగా వీడియోలు ప్లే అవ్వకూడదంటే ‘ఆటో ప్లే’ ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి. వీడియో ప్లే అవుతున్నప్పుడు దాని మీద సెటింగ్స్ కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేసి ఆటో ప్లే ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.
ఫోన్‌లో యూట్యూబ్‌ను చూస్తున్నప్పుడు సెర్చ్ బాక్స్‌లో అంతకుముందు ఏమేం సెర్చ్ చేశామో ఇట్టే తెలిసిపోతుంటుంది. ఇలా వీడియోల హిస్టరీ సేవ్ అవ్వకూడదంటే సెర్చ్ హిస్టరీని పాజ్ చేసుకోవచ్చు. దీనికోసం ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ’లోకి వెళ్లాలి. అక్కన ‘ఇంక్లూడ్ యువర్ సెర్చెస్ ఆన్ యూట్యూబ్’ బాక్స్‌ను అన్‌చెక్ చేస్తే చాలు.
ఒక వీడియో చూస్తున్నప్పుడు అలాంటి వీడియోలే ఇంకా కావాలనుకుంటే వీడియో పూర్తయ్యేంతవరకు ఆగాల్సిన పని లేదు. ఫుల్ స్క్రీన్ మోడ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు పైకి స్వైప్ చేస్తే చాలు. వీడియో రికమండేషన్లు కనిపిస్తాయి.