గాల్లోనే ప్రపంచాన్ని చూపించే హోలోగ్రామ్ టెక్నాలజీ తెలుసా?

నార్మల్ ఫోన్ నుంచి కలర్ ఫోన్. కలర్ ఫోన్ నుంచి టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ నుంచి ఫోల్డబుల్ స్క్రీన్. మరి నెక్స్ట్..? నెక్స్ట్ హోలోగ్రామ్. అంటే గాల్లోనే స్క్రీన్ అన్నమాట. అప్పుడప్పుడు సినిమాల్లో హీరోలు స్క్రీన్‌పై టచ్ చేయగానే అప్పటివరకు లేని ఓ కొత్త మనిషి గాల్లో ప్రత్యక్షమై మాట్లాడుతుంటాడు. ఇలాంటి టెక్నాలజీలు త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Update:2024-07-01 07:00 IST

నార్మల్ ఫోన్ నుంచి కలర్ ఫోన్. కలర్ ఫోన్ నుంచి టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ నుంచి ఫోల్డబుల్ స్క్రీన్. మరి నెక్స్ట్..? నెక్స్ట్ హోలోగ్రామ్. అంటే గాల్లోనే స్క్రీన్ అన్నమాట. అప్పుడప్పుడు సినిమాల్లో హీరోలు స్క్రీన్‌పై టచ్ చేయగానే అప్పటివరకు లేని ఓ కొత్త మనిషి గాల్లో ప్రత్యక్షమై మాట్లాడుతుంటాడు. ఇలాంటి టెక్నాలజీలు త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి. ఇదెలా ఉంటుందంటే..

హోలోగ్రామ్‌ టెక్నాలజీ.. అప్‌డేటెడ్ వర్చువల్ రియాలిటీ లాంటిది. సింపుల్‌గా చెప్పాలంటే గాల్లో పెయింటింగ్ అనొచ్చు. ఎలాంటి తెర అవసరం లేకుండా గాల్లో కదిలే కాంతి కిరణాల ద్వారా ఈ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఈ టెక్నాలజీతో గాల్లోనే గేమ్స్‌ ఆడొచ్చు. గాల్లోనే స్క్రీన్‌ ఆపరేట్ చేయొచ్చు. వర్చువల్ రోబోలతో మాట్లాడొచ్చు. కోరుకున్న వర్చువల్ ఆబ్జెక్ట్స్‌ని దగ్గరగా, నేరుగా చూడొచ్చు. ఇలా ప్రపంచాన్నంతా గాల్లోనే చూసేయొచ్చు.

హోలోగ్రామ్ టెక్నాలజీని ప్రస్తుతం ప్రజెంటేషన్స్‌కు ఎక్కువగా వాడుతున్నారు. రకరకాల యానిమేషన్స్, వస్తువులు, ప్రొడక్ట్స్, వాటి పనితీరు లాంటివి త్రీడీ ప్రెజెంటేషన్స్ రూపంలో చూపించేందకు ఈ టెక్నాలజీ బాగా పనికొస్తుంది. మొదట్లో టూడీ హోలోగ్రామ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు త్రీడీ హోలోగ్రామ్ కూడా వచ్చేసింది. అంటే.. డిస్‌ప్లే అన్ని వైపుల నుంచి కనిపిస్తుంది. త్రీడీ గ్లాసుల అవసరం లేకుండానే ఇది త్రీడీ విజువల్‌ను చూపిస్తుంది.

అన్ని రంగాల్లో

హోలోగ్రామ్ టెక్నాలజీని ఎంటర్‌‌టైన్‌మెంట్, ప్రమోషన్స్, ఇన్ఫర్మేషన్ రంగాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ప్రమోషన్స్‌ను క్రియేటివ్‌గా ప్రజెంట్ చేయడానికి, మాటల్లో చెప్పలేని టెక్నికల్ కాన్సెప్ట్‌ను సులభంగా వివరించడానికి హోలోగ్రామ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మరింత డెవలప్ చేస్తే అన్ని రంగాల్లో స్క్రీన్స్‌కు బదులు హోలోగ్రఫీ డిస్‌ప్లేను వాడొచ్చు. ఉదాహరణకు ఏదైనా కారు షో రూమ్‌కు వెళ్లినప్పుడు రకరకాల కారు మోడల్స్‌ను గాల్లో డిస్‌ప్లే చేయొచ్చు. సెలెక్ట్ చేసుకున్న కారు పనితీరును హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే ద్వారా ప్లే చేసి చూపించొచ్చు.

మెబైల్స్‌ కూడా..

ఫ్యూచర్‌‌లో మొబైల్ ఫోన్స్, టీవీ, స్మార్ట్ వాచీలు కూడా హోలోగ్రామ్ టెక్నాలజీకి మారిపోయే అవకాశం ఉంది. హోలోగ్రాఫిక్ వాచి డిజైన్స్ కూడా వస్తున్నాయి. క్లిక్ చేయగానే వాచి నుంచి లేజర్ కిరణాల ద్వారా ఒక డిస్‌ప్లే కళ్ల ముందు కదులుతుంది. దాన్ని స్మార్ట్ ఫోన్‌కి లింక్ చేసి, మొబైల్‌లో ఉండే అప్లికేషన్స్ అన్నీ హోలోగ్రఫీ డిస్‌ప్లేలో ఆపరేట్ చేయొచ్చు.

ఇలా చాలా రంగాల్లో ఈ టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. మరో ఐదేళ్లలో హోలోగ్రామ్ టెక్నాలజీ ప్రతీ ఫోన్‌లోకి వచ్చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News