మీకు సోషల్ మీడియా ఫోమో ఉందా? ఇలా తెలుసుకోండి!
సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేవాళ్లకు ‘ఫోమో’ అనే కొత్తరకం ఫోబియా ఉంటున్నట్టు కొన్ని రీసెర్చ్‌ల్లో తేలింది. ఫోమో అంటే ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’. అంటే ఏదో కోల్పోతున్నాం అనే భయం అన్నమాట. ఈ ఫోబియా ఎలా ఉంటుందంటే.
సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేవాళ్లకు ‘ఫోమో’ అనే కొత్తరకం ఫోబియా ఉంటున్నట్టు కొన్ని రీసెర్చ్‌ల్లో తేలింది. ఫోమో అంటే ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’. అంటే ఏదో కోల్పోతున్నాం అనే భయం అన్నమాట. ఈ ఫోబియా ఎలా ఉంటుందంటే.
ఫోమో మాయలో పడ్డవాళ్ల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. తాము ఏదో మిస్ అవుతున్నాం అనే ఆతృత అనుక్షణం ఊహా ప్రపంచంలో విహరించేలా చేస్తుంది. ఆన్‌లైనే లోకంగా గడిపేస్తుంటారు. నిమిషంలో ముప్ఫైసార్లు ఫోన్‌ని చెక్ చేసుకోవడం. భిన్నంగా ఉండాలనే తపనతో వెరైటీ కాన్సెప్ట్‌తో ఫొటోలు తీసి పోస్ట్ చేయడం. అత్యవసర పనులను కూడా లెక్కచేయకపోవడం. ఎప్పుడూ దిగాలుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన మానసిక సమస్య అంటున్నారు సైకాలజిస్టులు. దీన్నుంచి బయటపడకపోతే జీవితం అంతా బాధ పడాల్సివస్తుందట.
సోషల్ మీడియా చూడడం మానేస్తే ఏదో మిస్ అవుతాం అన్న భయం. ఫ్రెండ్ ఫొటోకి లైక్‌లు వచ్చాయి, నాకు ఎందుకు రాట్లేదు? అన్న బెంగ, అందరూ హ్యాపీగా ఉంటున్నారు నేను తప్ప అనే బాధ.. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నవాళ్లంతా ఫోమో సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం. ఈ ఫోబియా ఉన్నవాళ్లు పరిసరాలను పట్టించుకోరు. ఇంటికి సన్నిహితులొచ్చినా సమయాన్ని కేటాయించరు. చదువులో మార్కులు తగ్గుతున్నా పుస్తకం పట్టుకోరు. సందర్భం ఏదైనా చేతులు ఎప్పుడూ మొబైల్‌ను తడుముతూనే ఉంటాయి. ఇది మరింత ఎక్కువైతే యాంగ్జైటీ, డిప్రెషన్‌కు దారితీస్తాయి.
ఇలా బయటపడాలి
ఈ తరహా సోషల్ మీడియా ఫోబియా వల్ల బంధాలు, చదువు, ఉద్యోగం ఇలా.. అన్ని దెబ్బతింటాయి. జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియదు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే దాన్నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
స్నేహితుల పోస్ట్‌లు చూసి ఏదో మిస్ అయ్యాను అనే ఫీలింగ్ తెచ్చుకోకూడదు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫీలింగ్స్ నిజం కాదని తెలుసుకోవాలి.
పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి. జీవితంలో మీరు ఎంచుకున్న గోల్స్‌పై దృష్టి పెట్టాలి. అదే నిజమైన సక్సెస్ అని తెలుసుకోవాలి.
రోజులో కొంత సమయం ఫోన్ పక్కన పెట్టేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఆఫ్‌లో పెట్టుకోవాలి. కష్టంగా ఉన్నా ముందు మొదలుపెడితే అదే అలవాటు అవుతుంది.
చేస్తున్న పనిలో పూర్తిగా నిమగమవ్వడం వల్ల మనకు ఆనందం దొరుకుతుంది. అప్పుడు ఇతరుల గురించి కానీ వారు ఏం చేస్తున్నారని కానీ ఆలోచించరు. ఏదో మిస్ అయ్యాననే భావన కలగదు.
ఊహలకి అంతం ఉండదు. వాస్తవంలో బ్రతకడం నేర్చుకోకపోతే జీవితాంతం డిప్రెషన్‌లో గడపాల్సి వస్తుంది. జీవితంలో ఏది మిస్ అయినా పర్వాలేదు కానీ జీవితాన్నే మిస్ అయితే ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. కాబట్టి సోషల్ మీడియా కంటే రియల్ లైఫ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి.
ఎంత ప్రయత్నించినా సోషల్ మీడియా లోకం నుంచి బయటపడలేకపోతుంటే సైకాలజిస్ట్ సాయం తీసుకోడానికి వెనుకాడొద్దు.