మీకు సోషల్‌మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారా? ఇవి తెలుసుకోండి!

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉండేవాళ్లు వ్యూవర్స్‌ని ప్రభావితం చేసే వీలుంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లంతా ప్రమోషన్స్, యాడ్స్ విషయంలో కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. లేకపోతే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.

Advertisement
Update:2024-06-12 10:24 IST

సోషల్ మీడియాలో చాలామంది క్రియేటివ్ కంటెంట్‌తో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారుతుంటారు. తమ అకౌంట్లకు ఫాలోవర్లను కూడా సంపాందించుకుంటారు. ఇలాంటి వాళ్లంతా బ్రాండింగ్, ప్రమోటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉండేవాళ్లు వ్యూవర్స్‌ని ప్రభావితం చేసే వీలుంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లంతా ప్రమోషన్స్, యాడ్స్ విషయంలో కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. లేకపోతే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.

ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఉండేవాళ్లు అప్పుడప్పుడు కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ చేస్తుంటారు. వీళ్లపై ఉండే అభిమానంతో వ్యూవర్స్ ఆయా బ్రాండ్స్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయా ప్రొడక్ట్స్, సర్వీసుల్లో ఏవైనా మోసాలు జరిగితే అందులో ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ప్రమోషన్స్ విషయంలో ఆచి తూచి వ్యవహరించాలంటున్నారు నిపుణులు.

జాగ్రత్తలు ఇలా..

ఏవైనా ప్రొడక్ట్స్ లేదా సర్వీసులను ప్రమోట్ చేసేటప్పుడు సొంత నిర్థారణలు చేయకుండా కేవలం వాటి డిస్క్రిప్షన్ మాత్రం చెప్తే సరిపోతుంది.

వివాదాలను సృష్టించే ప్రొడక్ట్స్, సర్వీసుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. దీనివల్ల ఫాలోయింగ్ తగ్గడంతో పాటు ఏవైనా రిస్క్‌లు ఎదుర్కోవాల్సి కూడా రావొచ్చు.

ప్రమోషన్ చేస్తున్నప్పుడు అది ప్రమోషన్ అని తెలిసేలా ఉంటే చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ప్రమోషన్‌ను సీరియస్‌గా తీసుకుని దాన్ని మీ సొంత అభిప్రాయంలా మార్చి చెప్తే రకరకాల ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.

యూట్యూబ్‌లో ప్రమోషన్స్ చేసేటప్పుడు పైన స్పాన్సర్డ్ అన్న ట్యాగ్ పెట్టాలి. లేకపోతే అది మీ సొంత కంటెంట్ కిందకు వస్తుంది.

ప్రమోషన్స్ విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫాలోవర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే మంచిది. తమ ఫాలోవర్లకు నచ్చని వాటిని ప్రమోట్ చేస్తే సొంత బ్రాండింగ్ దెబ్బ తింటుంది. కాబట్టి ప్రమోషన్స్ ఎంచుకునేవిషయంలో తగిన వ్యూవర్స్‌ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం బెటర్.

ఇకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్‌కు దగ్గరగా ఉండే ప్రొడక్ట్స్ లేదా సర్వీసులనే ఎంచుకోవాలి. ఉదాహరణకు కెరీర్ గైడెన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కోర్సుల గురించిన యాడ్లు, మోడల్స్.. బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్లు ఇస్తే.. ప్రమోషనల్ రీచ్ పెరగడంతో పాటు సొంత బ్రాండింగ్ కూడా డెవలప్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News