ఎలక్ట్రానిక్ షో 2024.. ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్‌పై ఓలుక్కేయండి!

సరికొత్త టెక్ ఇన్నోవేషన్స్‌ను పరిచయం చేస్తూ ప్రతి ఏటా ‘కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ అనే గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో ప్రపంచంలోని రకరకాల టెక్ సంస్థలు తమ లేటెస్ట్ ఇన్నోవేషన్స్‌ను ప్రజెంట్‌ చేస్తుంటాయి.

Advertisement
Update:2024-01-12 06:00 IST

సరికొత్త టెక్ ఇన్నోవేషన్స్‌ను పరిచయం చేస్తూ ప్రతి ఏటా ‘కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ అనే గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో ప్రపంచంలోని రకరకాల టెక్ సంస్థలు తమ లేటెస్ట్ ఇన్నోవేషన్స్‌ను ప్రజెంట్‌ చేస్తుంటాయి. మరి ఈ ఏడాది ఈవెంట్‌లో ప్రదర్శించిన కొన్ని లేటెస్ట్ గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేద్దామా!

కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అనేది ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఈవెంట్. ప్రస్తుతం ఇది లాస్‌వేగాస్‌లో జరుగుతుంది. ఇందులో వెయ్యికి పైగా టెక్ స్టార్టప్‌లతో పాటు అమెజాన్, డెల్, గూగుల్, ఆసుస్, ఎల్‌జీ, శాంసంగ్, ఇంటెల్.. ఇలా ప్రముఖ సంస్థలన్నీ తమ లేటెస్ట్ ఆవిష్కరణలకు ప్రదర్శిస్తుంటాయి.

రిమోట్ రింగ్

లోటస్ అనే సంస్థ రూపొందించిన రిమోట్ రింగ్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇదొక స్మార్ట్ రింగ్. దీంతో ఇంట్లోని స్మార్ట్ టీవీ, లైట్స్.. ఇలా స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను కంట్రోల్ చేయొచ్చు.

ట్రాన్స్‌పరెంట్ టీవీ

ఎలక్ట్రానిక్ షోలో అందర్నీ ఆకట్టుకున్న కొత్త ఇన్నోవేషన్ ట్రాన్స్‌పరెంట్ టీవీ. ఎల్‌జీ సంస్థ రూపొందించిన ఈ టీవీపేరు ‘సిగ్నేచర్ ఓఎల్‌ఈడీ టీవీ’. ఇది అచ్చం ట్రాన్స్‌పరెంట్ అద్దంలా కనిపిస్తూనే అందులో పిక్చర్‌‌ను డిస్‌ప్లే చేస్తుంది. అంటే గాల్లోనే దృశ్యం కనిపిస్తున్నట్టు ఉంటుందన్న మాట.

స్క్వీల్స్

స్కై అనే ఫ్రెంచ్ సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ వీల్స్‌తో రోడ్లపై రయ్ మని దూసుకెళ్లొచ్చు. ఇవి కాళ్లకు తొడుక్కునే బూట్ల మాదిరిగా ఉంటాయి. వీటికి రెండేసి చొప్పున వీల్స్ కూడా ఉంటాయి. వీటిని తొడుక్కుని నిల్చొనే రోడ్లపై దూసుకెళ్లొచ్చు.

సైలెంట్ మాస్క్

స్కైటెడ్ అనే సంస్థ రూపొందించిన స్మార్ట్ మాస్క్‌తో పొల్యూషన్ నుంచి సేఫ్‌గా ఉండడమే కాకుండా పెట్టుకుని ఫోన్ కాల్స్ కూడా మాట్లాడొచ్చు. ఇతరులకు మీ మాటలు వినిపించకుండా సైలెంట్‌గా ఫోన్ కాల్స్ మాట్లాడుకునేందుకు ఈ మాస్క్ రూపొందించారు.

పెట్ రోబో

ఓఆర్వో అనే సంస్థ రూపొందించిన ఏఐ రోబో.. ఇంట్లోని పెట్స్‌ను చూసుకుంటుందట. ఈ రోబో పెట్స్‌కు ఫుడ్ ఇవ్వడం, వాటి ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం వంటి అవసరాలన్నీ చూసుకుంటుంది.

ఇంకా ఈ షోలో మనిషిలా కనిపిస్తూ మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెడ్ బూత్‌లు, ఇంటికి వేసుకునేందుకు స్మార్ట్ లాక్‌లు, వీఆర్ హెడ్‌ సెట్‌లు, ఇంటెల్ లేటెస్ట్ జనరేషన్ చిప్‌సెట్‌లు, సోనీ హోండా స్మార్ట్ కార్ వంటి పలు ఇంట్రెస్టింగ్ టెక్నాలజీలు కూడా ఇంట్రడ్యూస్ కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News