ఆగస్టులో రాబోయే మొబైల్స్ ఇవే!

ఎప్పటిలాగానే రాబోయే ఆగస్టు నెలలో కూడా పలు ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకూ అన్ని కేటగిరీల ఫోన్లు ఉన్నాయి.

Advertisement
Update:2024-07-30 09:00 IST

ఎప్పటిలాగానే రాబోయే ఆగస్టు నెలలో కూడా పలు ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకూ అన్ని కేటగిరీల ఫోన్లు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.

పోకో ఎమ్6 ప్లస్ 5జీ(POCO M6 Plus 5G)

ఆగస్టు1వ తేదీన పోకో నుంచి ‘పోకో ఎమ్6 ప్లస్ 5జీ’ అనే మొబైల్ ఇండియాలో లాంఛ్ అవ్వనుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.79 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 5030 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ధర సుమారు రూ. 13,000 ఉండొచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40X 5G)

ఆగస్టు 5వ తేదీన ‘ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ’ ఇండియాలో లాంచ్ అవ్వబోతోంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ధర సుమారు రూ. 15,000 ఉండొచ్చు.

గూగుల్‌ పిక్సెల్‌ 9 (Google Pixel 9)

వచ్చే నెలలో గూగుల్‌ నుంచి పిక్సెల్‌ 9 సిరీస్‌ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. ఈ సిరీస్‌లో పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్, పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ అనే మోడల్స్ ఉంటాయి. ఇవి గూగుల్ టెన్సర్ జీ2 ప్రాసెసర్‌‌పై పనిచేస్తాయి. గూగుల్ జెమినీ ఏఐ ఇంటర్ ఫేస్‌తో ఈ మొబైల్స్ రానున్నాయి. ధరలు రూ. 50,000 నుంచి మొదలవుతాయి.

ఒప్పో కె12 5జీ (Oppo K12x 5G)

ఆగస్టు నెలలో ఒప్పో నుంచి ‘ఒప్పో కె12 5జీ’ మొబైల్ రిలీజవ్వనుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 45వాట్ ఫాస్ట్ చార్జర్‌‌ను సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. తో వస్తోంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే..120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ధర సుమారు రూ.18,000 ఉండొచ్చు.

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్(Nothing Phone 2a Plus)

ఆగస్టు నెలలో నథింగ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మొబైల్ రానుంది. ‘నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్’ పేరుతో రిలీజవుతున్న ఈ మొబైల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 50ఎంపీ డ్యుయల్ కెమెరాతో పాటు ముందువైపు కూడా 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ధర సుమారు రూ.26,000 ఉండొచ్చు.

మోటొరోలా ఎడ్జ్ 50 5జీ(Motorola Edge 50 5G)

మోటొరోలా నుంచి ‘మోటొరోలా ఎడ్జ్ 50’ పేరుతో ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఇండియాలో లాంఛ్ అవ్వనుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ధర సుమారు రూ. 30,000 ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News