ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం బెస్ట్ స్మార్ట్ వాచీలు!

స్మార్ట్ వాచీల్లో ఉండే భిన్నమైన ఫీచర్లు, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఆప్షన్లు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే మార్కెట్లో స్మార్ట్ వాచీల సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి.

Advertisement
Update:2024-05-31 06:00 IST

స్మార్ట్‌ఫోన్స్ తర్వాత ఇప్పటి యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్న గ్యాడ్జెట్.. స్మార్ట్​వాచ్. చేతికి స్మార్ట్‌వాచ్ ఉంటే మొబైల్‌తో కూడా పెద్దగా పని ఉండదు. మెసేజ్‌లు, మెయిల్ నోటిఫికేషన్లు కూడా వాచీలోనే చూసుకోవచ్చు. అలాగే హార్ట్​ రేట్​, బీపీ, స్లీప్​ టైమ్​, క్యాలరీ కౌంట్ వంటి హెల్త్ పరమైన అంశాలు కూడా తెలుసుకోవచ్చు.

స్మార్ట్ వాచీల్లో ఉండే భిన్నమైన ఫీచర్లు, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఆప్షన్లు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే మార్కెట్లో స్మార్ట్ వాచీల సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచీల్లో కొన్ని ఇవీ.

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా బజ్

నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా బజ్ వాచీలో 1.75 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్టెప్ కౌంట్, స్లీప్ మానిటర్ వంటి ఫీచర్లుంటాయి. అలాగే ఇది డస్ట్ ప్రూఫ్, మల్టిపుల్ స్పోర్ట్ మోడ్స్, కస్టమ్ యూఐ వంటి ఆప్షన్స్‌తో వస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ తొమ్మిది రోజుల వరకూ వస్తుంది. ధర రూ.2,500 ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6

ప్రీమియం స్మార్ట్ వాచీ వాడాలనుకునేవాళ్లు శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 ఎంచుకోవచ్చు. ఇందులో బీపీ, హార్ట్​బీట్​, ఈసీజీ, స్లీపింగ్ స్టేజెస్ వంటి పలు అడ్వాన్స్‌డ్ హెల్త్ ​ ట్రాకింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 1.5 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, వాటర్‌‌ ప్రూఫ్ వంటి ఫీచర్స్‌ ఉంటాయి. వారం రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ధర రూ.26,000 ఉంటుంది.

బోట్‌ వేవ్ సిగ్మా 3

బోట్‌ వేవ్ సిగ్మా 3 స్మార్ట్‌వాచ్ 2.1 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కస్టమైజ్డ్ యూఐని సపోర్ట్ చేస్తుంది. ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్, ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఆక్సిజన్ రీడింగ్ వంటి ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.1,500 ఉంటుంది.

రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్

రెడ్​మీ వాచ్ 3 యాక్టివ్.. 1.83 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. యాక్టివిటీ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటర్, హార్ట్​బీట్ రేట్ వంటి ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ.2,500 ఉంటుంది.

అమేజ్‌ఫిట్ జీటీఆర్ 4

అమేజ్‌ఫిట్ జీటీఆర్ 4 స్మార్ట్​వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుది. 1.43 ఇంచెస్ డిస్ ప్లే ఉంటుంది. అన్నిరకాల హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంంది. బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్, వైఫై కనెక్టివిటీ, జీపీఎస్ వంటి పీచర్లు కూడా ఉన్నాయి. ధర రూ. 15,000 ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News