ఇండియాలో బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే..
మనదేశంలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి.
మనదేశంలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
మామూలు ఫోన్లకు, గేమింగ్ ఫోన్లకు మధ్య కొన్ని తేడాలుంటాయి. ముఖ్యంగా గేమింగ్ ఫోన్స్‌లో హైస్పీడ్ ప్రాసెసర్, హై రీఫ్రెష్ రేట్ ఉండాలి. అలాగే ఎక్కువసేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ప్రాసెసర్ కంట్రోల్ చేయగలగాలి. అలాగే ఎక్కువ బ్యాటరీ కూడా ఉండాలి. అలాంటి హార్డ్‌వేర్‌తో రూపొందించిన మొబైల్స్.. గేమింగ్‌కు బాగా సరిపోతాయి.
ఐకూ నియో 7
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గేమింగ్ ఫోన్స్‌లో ‘ఐకూ నియో7’ 5జీ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తోంది. రూ. 29,999 ధర ఉన్న ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంంది. ఇందులో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ వాడారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పెద్దపెద్ద గేమ్స్‌ను కూడా ఈ మొబైల్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.
పోకో ఎక్స్ 5 ప్రో
మార్కెట్లో ఉన్న మరో మంచి గేమింగ్ ఫోన్ పోకో ఎక్స్ 5 ప్రో. రూ. 22,999కు లభించే ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను వాడారు. ఇందులో120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. హై స్పీడ్ గేమింగ్‌కు ఈ ఫోన్ బెస్ట్ చాయిస్.
వివో వీ 25
రూ. 27,999కు లభించే వివో వీ25 5జీ మొబైల్ మంచి గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఇందులో హై రిజల్యూషన్ డిస్‌ప్లే అలాగే 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఉన్న 4,500ఎంఏహెచ్ బ్యాటరీ.. 44వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.
రియల్ మీ 10 ప్రో
మిడ్ రేంజ్ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో గేమింగ్ ఫోన్ రియల్ మీ 10 ప్రో + 5జీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 24,999గా ఉంది. ఇది 160 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది .ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5జీ ప్రాసెసర్ వాడారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ.. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఎలాంటి గేమ్‌నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.