పదివేల బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!
పది వేల రూపాయల బడ్జెట్‌లో మినిమం పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రాసెసర్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ, మంచి డిస్‌ప్లే ఉన్న మొబైల్స్ లిస్ట్ ఇదీ.
తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? పది వేల రూపాయల బడ్జెట్లో మంచి ఫీచర్లు అందించే మొబైల్స్ ఇటీవలి కాలంలో చాలానే వచ్చాయి. వాటిపై ఓ లుక్కేస్తే..
పది వేల రూపాయల బడ్జెట్‌లో మినిమం పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రాసెసర్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ, మంచి డిస్‌ప్లే ఉన్న మొబైల్స్ లిస్ట్ ఇదీ..
మోటో జీ34 5జీ
మోటీ జీ34 మొబైల్‌ను బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకోవచ్చు. దీని ధర సుమారు రూ.10,999 ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ధర సుమారు రూ.9,500 ఉంది. ఇందులో 6.60 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. శాంసంగ్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 6000 ఎంఏహెచ్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
రియల్‌మీ సీ53
రియల్‌మీ సీ53 ధర సుమారు రూ.8,600 ఉంటుంది. ఇది టీ612 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
నోకియా జీ42 5జీ
అత్యంత తక్కువ ధరకు లభించే 5జీ ఫోన్‌గా నోకియా జీ42 ను చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ధర సుమారు రూ.7,499 ఉంటుంది. ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
మోటరోలా జీ24 పవర్
ఇది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యాటరీ ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ధర సుమారు రూ.7,999 ఉంటుంది. 6.56 అంగుళాలు డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 6000 ఎంఏహెచ్. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఒప్పో ఎ3ఎస్
ఒప్పో ఎ3 ఎస్ ధర సుమారు రూ.8,400 ఉంటుంది. 6.20 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 4230ఎంఏహెచ్. 13ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.