Asus Zenfone 11 Ultra | అసుస్ నుంచి మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ అసుస్ జెన్‌ఫోన్ 11 ఆల్ట్రా..!

Asus Zenfone 11 Ultra | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ అసుస్ (Asus) త‌న అసుస్ జెన్‌ఫోన్ 11 ఆల్ట్రా (Asus Zenfone 11 Ultra) ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-03-15 15:01 IST

Asus Zenfone 11 Ultra | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ అసుస్ (Asus) త‌న అసుస్ జెన్‌ఫోన్ 11 ఆల్ట్రా (Asus Zenfone 11 Ultra) ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్క‌రించింది. నాలుగు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్‌3 చిప్‌సెట్‌తో ప‌ని చేస్తుంది. 6.78 అంగుళాల స్క్రీన్ డిస్‌ప్లే, 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫీచ‌ర్లు ఉంటాయి. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. అసుస్ జెన్‌ఫోన్ 11 ఆల్ట్రా ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.90,000 (999 యూరోలు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.99,000 (1099 యూరోలు) ప‌లుకుతుంది. ఎట‌ర్న‌ల్ బ్లాక్‌, మిస్టీ గ్రే, స్కైలైన్‌, డ‌స‌ర్ట్ శాండ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

అసుస్ జెన్‌ఫోన్ 11 ఆల్ట్రా ఫోన్ ఆండ్రాయిడ్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్‌) అమోలెడ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తున్న‌ది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ 2 ప్రొటెక్ష‌న్ క‌లిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. రియ‌ల్ టైం ఏఐ ట్రాన్స్‌స్క్రిప్ట్‌, ఏఐ బేస్డ్ సెర్చ్ టూల్‌, లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేష‌న్‌, నాయిస్ క్యాన్సిలేష‌న్ త‌దిత‌ర ఏఐ ఫీచ‌ర్లు ఉంటాయి.

అసుస్ జెన్‌ఫోన్ 11 ఆల్ట్రా (Asus Zenfone 11 Ultra) ఫోన్ కృత్రిమ మేధ బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌890 1/1.56 అంగుళాల ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ సిక్స్ యాక్సిస్ గింబాల్ స్టెబిలైజర్‌, 13 - మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 32- మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్స‌ర్ కెమెరా విత్ ఓఐఎస్ అండ్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ ఆర్జీబీడ‌బ్ల్యూ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

అసుస్ జెన్ ఫోన్ 11 ఆల్ట్రా (Asus Zenfone 11 Ultra) ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్‌, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, జీపీఎస్‌/ ఏ-జీపీఎస్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. 65వాట్ల హైప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌స్తుంది. 39 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్ 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తు కూడా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News