ఆసుస్ నుంచి అదరగొట్టే గేమింగ్ ఫోన్! ఫీచర్లివే..
ఆసుస్ రోగ్ అనేది గేమింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. గేమింగ్ ఫోన్స్‌గా మంచి క్రేజ్ సాధించిన ఆసుస్ రోగ్ ఫోన్లు ఇండియాలో ఇప్పటివరకూ అందుబాటులో లేవు. అయితే రీసెంట్‌గానే ఆసుస్ రోగ్ సిరీస్ నుంచి రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ప్రత్యేకతలేంటంటే..
ఆసుస్ రోగ్ అనేది గేమింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. గేమింగ్ ఫోన్స్‌గా మంచి క్రేజ్ సాధించిన ఆసుస్ రోగ్ ఫోన్లు ఇండియాలో ఇప్పటివరకూ అందుబాటులో లేవు. అయితే రీసెంట్‌గానే ఆసుస్ రోగ్ సిరీస్ నుంచి రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ప్రత్యేకతలేంటంటే..
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆసుస్ నుంచి రోగ్(రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్) సిరీస్ పేరుతో కొన్ని ల్యాప్ టాప్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సిరీస్ నుంచి తాజాగా ‘ఆసుస్ రోగ్ ఫోన్8’, ‘ఆసుస్ రోగ్ ఫోన్8 ప్రో’ పేర్లతో రెండు గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి.
ఆసుస్ రోగ్ 8 సిరీస్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. ఇవి అచ్చంగా గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి హై ఎండ్ పెర్ఫామెన్స్ కోసం రూపొందించిన ఫోన్లు. ఇవి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఫోన్స్‌గా నిలుస్తాయని ఆసుస్ సంస్థ చెప్తోంది.
రెండు ఫోన్లలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీఓ డిస్‌ప్లే ఉంటుంది. ఇది120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వీటిలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 13 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్‌తో పాటు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది.
ఆసుస్ రోగ్ 8 సిరీస్ ఫోన్స్‌లో గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. 5జీ సపోర్ట్ ఉంటుంది. వీటిలో 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఆసుస్ రోగ్ 8 ఫోన్.. 12 జీబీ/16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తుంది. ధర రూ.91,500 నుంచి ప్రారంభం అవుతుంది. ఆసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో వేరియంట్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ, 24 జీబీ ర్యామ్ విత్ 1 టిగా బైట్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తుంది. ధర రూ.94,999 నుంచి మొదలవుతుంది.