ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవులకు మేలే.. రీప్లేస్ చేయలేదు.. అడోబ్ చైర్మన్ శంతన్ కుండబద్దలు

రోబోల‌ను సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ - Artificial intelligence) వ‌ల్ల మాన‌వుల‌కు.. ప్ర‌త్యేకించి ఐటీ నిపుణుల ఉద్యోగాల‌కు ఢోకా లేదా..? ఇప్ప‌టివ‌ర‌కు టెక్ నిపుణులు లేవ‌నెత్తిన సందేహాలు ఉత్తివేనా..? అంటే అవున‌నే అంటున్నారు అడోబ్ చైర్మ‌న్ కం సీఈఓ (Adobe Chairman & CEO) శంత‌ను నారాయ‌ణ‌న్ (Shantanu Narayen).

Advertisement
Update:2023-08-26 14:49 IST

రోబోల‌ను సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ - Artificial intelligence) వ‌ల్ల మాన‌వుల‌కు.. ప్ర‌త్యేకించి ఐటీ నిపుణుల ఉద్యోగాల‌కు ఢోకా లేదా..? ఇప్ప‌టివ‌ర‌కు టెక్ నిపుణులు లేవ‌నెత్తిన సందేహాలు ఉత్తివేనా..? అంటే అవున‌నే అంటున్నారు అడోబ్ చైర్మ‌న్ కం సీఈఓ (Adobe Chairman & CEO) శంత‌ను నారాయ‌ణ‌న్ (Shantanu Narayen). కృత్రిమ మేధ వ‌ల్ల మాన‌వుల తెలివితేట‌లు పెరుగుతాయే గానీ వారిని రీప్లేస్ చేయ‌లేవ‌ని తేల్చి చెప్పారు. హైద‌రాబాద్ సంత‌తి ఎన్నారై శంత‌ను నారాయ‌ణ‌న్‌.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌పై త‌న‌కున్న అభిప్రాయాలు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. అప్పుడే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించాల‌ని తొంద‌ర‌ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. ఏఐలో అడ్వాన్స్‌డ్ ప్ర‌గ‌తిని ఏక‌ప‌క్షంగా నియంత్రించాల‌నుకోవ‌డంతో ముప్పు ఏర్ప‌డ‌వ‌చ్చున‌ని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు.

నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఏఐ-ఆధారిత ఉత్పత్తుల త‌యారీలో అడోబ్ ఇండియా నిమ‌గ్న‌మవుతుంద‌ని శంత‌ను నారాయ‌ణ‌న్ తెలిపారు. ఆర్టిఫిషియ‌ల్ అభివృద్ధితో వ‌చ్చే అవ‌కాశాల‌ను ఆదాయం సంపాద‌న‌కు కంపెనీ ఉప‌యోగించుకుంటుంద‌న్నారు.

సృజనాత్మక పరిశ్రమపై కృత్రిమ మేధ సామూహిక తుఫానులా విరుచుకు పడుతుందని అన్నారు శంతన్. దీనివల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా, మానవ మేధస్సు మెరుగు అవుతుందే కానీ, వారిని రీప్లేస్ చేయలేదని తేల్చేశారు. ప్రతి టెక్నాలజీ సామాజికంగా మేలు చేస్తుందని నమ్ముతున్నాం అని తెలిపారు. అదే సమయంలో కొన్ని సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

జనాభా, ప్రతిభ, టెక్నాలజీ సమ్మేళనంతో భారత్ భవితవ్యం ఉజ్వలంగా ఉంటుందని అన్నారు శంతన్ నారాయణన్. 60 ఏండ్ల వడిలో పడిన శంతన్.. గ్లోబల్ టెక్ కంపెనీల భారత సంతతి సీఈఓల్లో ఒకరు. హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారే..

Tags:    
Advertisement

Similar News