మీ లొకేషన్ వివరాలు సేఫ్‌గానే ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!

ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఏయే ప్రదేశాలకు వెళ్తున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలు ఆ వ్యక్తి ప్రైవసీకి చెందిన ముఖ్యమైన అంశాలు. మరి ఈ విషయంలో మీ ప్రైవసీ ఎంతవరకూ సేఫ్? మీ లోకేషన్ నిజంగా గోప్యంగానే ఉంటుందా? లేదా ఎవరికైనా తెలుస్తుందా?

Advertisement
Update:2023-12-25 11:45 IST

ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఏయే ప్రదేశాలకు వెళ్తున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలు ఆ వ్యక్తి ప్రైవసీకి చెందిన ముఖ్యమైన అంశాలు. మరి ఈ విషయంలో మీ ప్రైవసీ ఎంతవరకూ సేఫ్? మీ లోకేషన్ నిజంగా గోప్యంగానే ఉంటుందా? లేదా ఎవరికైనా తెలుస్తుందా? అన్న విషయాలు ఇలా చెక్ చేసుకోండి.

మీరు వాడుతున్న ఫోన్‌, అందులోని కొన్ని సెటింగ్స్‌ ఆధారంగా మీ లోకేషన్ ఇతరులకు తెలిసే అవకాశం ఉందని మీకు తెలుసా? జీపియస్ వంటి కొన్ని అవసరాల కోసం ఫోన్‌కు మన లొకేషన్ తెలుసుకునేందుకు పర్మిషన్ ఇవ్వక తప్పదు. అయితే ఇది కొన్ని రకాలుగా మిస్‌యూజ్ కూడా అవతుంది. దీన్నేలా అరికట్టొచ్చంటే..

ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఉండే గూగుల్ సర్వీస్ కోసం గూగుల్‌ మన లొకేషన్ వివరాలు తప్పక తెలుసుకుంటుంది. అయితే వీటిలో కొన్ని సెట్టింగ్స్‌ను ఆఫ్‌లో ఉంచడం ద్వారా సోషల్ మీడియా సంస్థలకు మన లొకేషన్ తెలియకుండా జాగ్రత్తపడొచ్చు.

హిస్టరీ డిలీట్

గూగుల్‌ యాప్‌ లేదా గూగుల్ వెబ్ పేజ్‌లో మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి ప్రొఫైల్ పిక్చర్ దగ్గర క్లిక్ చేసి ‘మై అకౌంట్’లో.. ‘డేటా అండ్‌ ప్రైవసీ ఆప్షన్’ ను ఎంచుకోవాలి. అక్కడ ‘లొకేషన్‌ హిస్టరీ’లోకి వెళ్లి ఫీచర్‌‌ను టర్న్‌ ఆఫ్‌ చేసి, కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. ఈ ఆప్షన్ కిందే ఆటో-డిలీట్‌ ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ టైం పీరియడ్ సెట్ చేసుకుంటే ఆ టైం పీరియడ్‌ను అనుసరించి ఆటోమెటిక్‌గా లొకేషన్ హిస్టరీ డిలీట్ అవుతుంది.

డిజేబుల్ షేరింగ్

ఇక రెండో సెట్టింగ్ లొకేషన్‌ షేరింగ్‌ను డిజేబుల్ చేయడం. అంటే ఏయే సంస్థలకు, వ్యక్తులకు మీ లోకేషన్ యాక్సెస్ ఇచ్చారో తెలుసుకుని దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. దీనికోసం ‘డేటా అండ్‌ ప్రైవసీ’ విభాగంలో ‘లొకేషన్‌ షేరింగ్‌’లోకి వెళ్లాలి. అక్కడ అనుచిత వ్యక్తులతో లేదా సంస్థలు, సైట్‌లతో షేరింగ్ చేస్తున్నట్టు చూపిస్తే అక్కడ ‘స్టాప్‌’ మీద నొక్కాలి.

యాప్స్‌కు పర్మిషన్

ఇక మరో సెట్టింగ్ ఫోన్ యాప్స్‌లో మార్చాల్సి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘లొకేషన్’ మీద క్లిక్ చేసి ‘యాప్ పర్మిషన్స్’ మీద క్లిక్ చేయాలి. అక్కడ ఏయే యాప్స్‌కు లొకేషన్ యాక్సెస్ ఇచ్చారో కనిపిస్తుంది. సేఫ్ కాదు అనుకున్న యాప్స్‌కు లొకేషన్ డిజేబుల్ చేయొచ్చు. ఇదే పనిని సెపరేట్‌గా ఒక్కోయాప్ పర్మిషన్స్‌లోకి వెళ్లి కూడా చేయొచ్చు.

మ్యాప్స్‌లో ఇలా..

ఇకపోతే గూగుల్‌ మ్యాప్స్‌ సెట్టింగ్స్‌లో ‘లొకేషన్‌ షేరింగ్‌’ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ ఎవరితోనైనా మీ లోకేషన్‌ను షేర్ చేసుకుంటున్నారేమో చెక్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆఫ్ చేయొచ్చు. ఇలాంటి టిప్స్ ద్వారా మీ లొకేషన్ డీటెయిల్స్ కొంతవరకైనా సేఫ్‌గా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News