ఐఓఎస్ 16 వచ్చేసింది. కొత్త ఫీచర్లివే..

ఐఫోన్‌ 16లో ఫోకస్‌ మోడ్‌ అనే కొత్త ఫీచర్ ఉండబోతోంది. ఇది ఆండ్రాయిడ్‌లోని ‘డు నాట్ డిస్టర్బ్’ లాంటిది. ఫోకస్ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్, కాల్స్ శబ్దాలు రావు.

Advertisement
Update:2022-09-14 15:55 IST

యాపిల్‌ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఓఎస్‌ 16 ఓఎస్‌ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో వస్తున్న ఈ ఓఎస్‌ ఎలా ఉండబోతోంది.? ఏయే ఐఫోన్ మోడల్స్‌కు ఈ ఓఎస్‌ సపోర్ట్ చేస్తుంది? ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్‌ తన డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022లో ప్రకటించిన విధంగానే ఐఓఎస్‌ 16ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఓఎస్ ముందుగా యూఎస్‌లోని యాపిల్ యూజర్లకు అప్‌డేట్‌ అవుతుంది. భారత్‌ యూజర్లుకు మాత్రం సెప్టెంబర్ 13 తేదీ ఉదయానికి అందుబాటులోకి వస్తుంది.

ఐఓఎస్‌ 16 ఐఫోన్‌ 8‌, ఐఫోన్‌ ఎక్స్‌‌, ఐఫోన్‌ 11‌, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్‌ ఎస్‌ఈ 2 (2020), ఐఫోన్‌ ఎస్‌ఈ 3 (2022) సిరీస్‌లతోపాటు కొత్తగా విడుదలైన ఐఫోన్‌ 14 మోడల్స్‌లో పనిచేస్తుంది. కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ గురించి మొబైల్‌కి నోటిఫికేషన్‌ వస్తుంది. యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి జనరల్‌ సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే ఓఎస్‌ డౌన్‌లోడ్‌ అండ్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ ఓఎస్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఐఓఎస్‌ 16లో లాక్‌స్క్రీన్‌ కస్టమైజేషన్‌ ఆప్షన్‌ ఉండబోతోంది. అంటే యూజర్లు తమకు నచ్చిన ఫొటోను లాక్‌స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేసుకోవచ్చు. లాక్‌స్క్రీన్‌పై ఉండే క్లాక్‌, ఫాంట్‌, రంగులు కూడా నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. లాక్ స్క్రీన్ పై నాలుగు విడ్జెట్స్‌ను కూడా సులువుగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

కొత్త ఓఎస్‌లో యూజర్లు ఫోన్‌ లాక్‌ వేసినా.. నోటిఫికేషన్లు చూడొచ్చు. ఇందులో ఎక్స్‌పాండ్‌ లిస్ట్‌ వ్యూ, స్టాక్డ్‌ వ్యూ, హిడెన్‌ వ్యూ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఫోన్‌ లాక్ పడినప్పుడు నోటిఫికేషన్లు డిస్‌ప్లే కింది భాగంలో కనిపిస్తాయి.

సైబర్‌ క్రైమ్స్ నుంచి రక్షణ కల్పించేందుకు ఐఓఎస్‌ 16లో 'లాక్‌డౌన్‌ మోడ్‌' అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నారు. యూజర్‌ ఈ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే ఫోన్‌ మెసేజింగ్‌, వెబ్‌ బ్రౌజింగ్‌తోపాటు ఇతర సేవల ద్వారా జరిగే సైబర్‌ దాడుల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని యాపిల్ చెప్తోంది.

కొత్త ఐఓఎస్‌లో ఫొటో ఎడిటింగ్‌కు సంబంధించి మరో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌ రాబోతుంది. యూజర్లు స్క్రీన్‌షాట్‌, సఫారీ బ్రౌజర్‌, గ్యాలరీలలో ఎక్కడి నుంచైనా ఫొటోను తీసుకుని దాని బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. వీడియోలో ఫ్రేమ్‌ పాజ్‌ చేసి, దానిపై ఉన్న టెక్ట్స్‌ను కాపీ, ట్రాన్స్‌లేట్, షేర్‌ చేసుకునే వీలుంది.

ఐఓఎస్ 16లో మెసేజ్ పంపిన 15 నిమిషాల లోపు మెసేజ్‌లను ఎడిట్‌, అన్‌సెండ్ చేసుకోవచ్చు. మెసేజ్‌ పంపిన తర్వాత దానిపై టాప్‌ చేస్తే ఎడిట్‌, అన్‌డూ సెండ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.

ఐఫోన్‌ 16లో ఫోకస్‌ మోడ్‌ అనే కొత్త ఫీచర్ ఉండబోతోంది. ఇది ఆండ్రాయిడ్‌లోని 'డు నాట్ డిస్టర్బ్' లాంటిది. ఫోకస్ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్, కాల్స్ శబ్దాలు రావు.

Tags:    
Advertisement

Similar News