ఛాట్ జీపీటీకి పోటీగా యాపిల్ ‘ఆస్క్’.. ప్రత్యేకతలేంటంటే..

ఓపెన్ ఏఐ ఛాట్​జీపీటీ, గూగుల్ జెమినీలకు పోటీగా యాపిల్ ‘ఆస్క్(Ask)’ పేరుతో ఓ కొత్త ఏఐ టూల్​ను డెవలప్ చేస్తోంది.

Advertisement
Update:2024-02-26 15:00 IST

ప్రస్తుతం అన్ని కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై ఫోకస్ చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ రూపొందించిన ఛాట్ జీపీటీ టూల్ బాగా సక్సెస్ అవ్వడంతో మైక్రోసాఫ్ట్ , గూగుల్ వంటి సంస్థలు కూడా తమ సొంత ఏఐ టూల్స్‌పై ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు కొత్తగా యాపిల్ కంపెనీ కూడా రంగంలోకి దిగింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఓపెన్ ఏఐ ఛాట్​జీపీటీ, గూగుల్ జెమినీలకు పోటీగా యాపిల్ ‘ఆస్క్(Ask)’ పేరుతో ఓ కొత్త ఏఐ టూల్​ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టూల్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే యాపిల్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

యాపిల్ డివైజెస్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’కి ఈ కొత్త ఏఐ టూల్‌ను కనెక్ట్ చేయనున్నారు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్.. జెమినీ టూల్‌ను డెవలప్ చేస్తున్న నేపధ్యంలో యాపిల్ తమ యూజర్ల కోసం ఈ కొత్త టూల్‌ను డెవలప్ చేస్తోంది. ఇది కేవలం యాపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రాబోయే ఐఓఎస్ 18తో ఇది పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం యాపిల్ టీం.. ‘ఆస్క్’కు ట్రైనింగ్ ఇస్తున్నారు. సంక్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ సరైన సమాధాలు ఎలా ఇవ్వాలో ట్రైన్ చేస్తున్నారు.

ఇక యాపిల్ ఏఐ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇందులో నేచురల్ లాంగ్వేజ్ మోడల్ ఉండనుంది. అంటే యూజర్లు అడిగే సాధారణ భాషను పూర్తిగా అర్థం చేసుకుని తేలిక భాషలోనే సమాధానాలు ఇస్తుంది. అలాగే ఇది మల్టీమోడ్ ఇన్‌పుట్స్‌ను తీసుకుంటుంది. అంటే టైప్ చేసినా, మాట్లాడినా లేదా గెశ్చర్స్ వంటివి చేసినా అర్థం చేసుకోగలదు.

యాపిల్ ఏఐ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇస్తుంది. అంటే యూజర్ల వ్యక్తిగత వివరాలు, ఇష్టాలను దృష్టిలో ఉంచుకని తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ టూల్ ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. యూజర్ల డేటాను భద్రంగా దాచుతుంది.

Tags:    
Advertisement

Similar News