ఆండ్రాయిడ్ 15 రాబోతోంది! కొత్త ఫీచర్లివే..
గూగుల్ ఇటీవల నిర్వహించిన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను ప్రకటించింది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.
గూగుల్ ఇటీవల నిర్వహించిన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను ప్రకటించింది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త వెర్షన్‌లో ఏమేం ఫీచర్లు ఉంటాయంటే..
త్వరలోనే గూగుల్ ఆండ్రాయిడ్ 15 వెర్షన్ రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ కొన్ని మొబైల్స్‌లో రన్ అవుతుంది. అయితే రాబోయే వెర్షన్‌లోని ఫీచర్లను ఇప్పటికే గూగుల్ ప్రకటించింది. వాటిలో కొన్ని ఇవీ..
కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ‘ప్రైవేట్ స్పేస్’ అనే కొత్త ఫీచర్ ఉండబోతోంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు మొబైల్‌లో మరో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుని అందులో సెపరేట్ యాప్స్, సెట్టింగ్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 15 లో ‘ప్రెడిటివ్ బ్యాక్’ అనే కొత్త బటన్ యాడ్ అవ్వనుంది. యాప్ లేదా సెట్టింగ్స్ నుంచి ఒకేసారి హోమ్ స్క్రీన్ లేదా మెయిన్ సెట్టింగ్స్‌కు వచ్చేలా ఈ బటన్ ఉపయోగపడుతుంది.
ఆండ్రాయిడ్ 15 లో ‘యాప్ పెయిర్స్’ అనే మరో స్క్రీ రికార్డింగ్ ఫీచర్ ఉండనుంది. అంటే స్క్రీన్ మీద కనిపించేదంతా రికార్డ్ కాకుండా పర్టిక్యులర్ పార్ట్ వరకూ కూడా రికార్డ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 15 లో ‘కస్టమ్ వైబ్రేషన్స్’ అనే మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రానుంది. అంటే మీకు నచ్చిన విధంగా వైబ్రేషన్ అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మెసేజ్‌కు సింగిల్ వైబ్రేషన్, మెయిల్‌కు రెండు వైబ్రేషన్లు.. ఇలా సెట్ చేసుకోవచ్చన్న మాట.
ఇక వీటితోపాటు యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్, ఓటీపీ ప్రొటెక్షన్ వంటి కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ కూడా యాడ్ అవ్వనున్నాయి. అలాగే కొత్త ఓఎస్.. శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాల్యూమ్ స్లైడర్స్, విడ్జెట్స్ వంటి కొన్ని డిజైనింగ్ మార్పులు కూడా ఉండనున్నాయి.