వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ను పరిచయం చేసే వాట్సాప్.. త్వరలోనే మూడు సరికొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది.

Advertisement
Update:2023-05-08 00:49 IST

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ను పరిచయం చేసే వాట్సాప్.. త్వరలోనే మూడు సరికొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ ఛానల్స్, కంపానియన్, సైడ్ బై సైడ్ వ్యూ లాంటి ఫీచర్లు త్వరలోనే యూజర్లకు అందుబాటులో ఉంటాయని చెప్తోంది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే..

సెలబ్రిటీలు, సంస్థలు, ఎక్కువ మంది ఫాలో అయ్యే వ్యక్తులు తమ ఆడియెన్స్‌కు కనెక్టెడ్‌గా ఉండేలా ట్విట్టర్ తరహాలో ‘ఛానల్’ అనే కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది వాట్సాప్. ఒకేసారి ఎక్కువమంది వ్యక్తులకు పోస్ట్‌ను చేరవేయడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వాట్సాప్‌ ‘ఛానల్‌’ అనేది ప్రైవేటు టూల్‌. యూజర్‌ ఫోన్‌ నంబర్‌, ఇతర ఇన్ఫర్మేషన్ రహస్యంగానే ఉంటాయి.

వాట్సాప్ తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్ ‘కంపానియన్ మోడ్’. ఈ ఫీచర్ సాయంతో ఒకే ప్రైమరీ అకౌంట్ తో మూడు ఫోన్లలో వాట్సాప్ వాడొచ్చు. మొత్తంగా ఒకే అకౌంట్ ను నాలుగు ఫోన్లలో ఉపయోగించొచ్చు. అయితే, ప్రైమరీ ఫోన్‌లో వాట్సాప్ అకౌంట్ ఎక్కువ రోజులు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే మాత్రం కంపానియన్ మోడ్‌తో జతచేసిన మిగిలిన ముడు ఫోన్లలో అకౌంట్ ఆటోమేటిక్‌గా లాగవుట్ అవుతుంది. ఈ కంపానియన్ మోడ్ ద్వారా జత చేసిన అన్ని ఫోన్లలోని మీడియా, మెసేజెస్ , కాల్స్ వంటివి ఎండ్ -టు- ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి.

మరికొన్ని రోజుల్లో వాట్సాప్‌లో ‘సైడ్ బై సైడ్ వ్యూ’ అనే ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురితో ఛాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతీ మెసేజ్‌కు బ్యాక్ కు వెళ్లకుండా ఒకేసారి స్క్రీన్‌పై రెండు చాట్ బాక్స్‌లను చూడొచ్చు.

Tags:    
Advertisement

Similar News