ఈ టూల్స్‌తో పాత ఫొటోలు కొత్తగా మార్చుకోవచ్చు!
పాత ఫొటోలకు కొత్త మెరుగులు దిద్దేలా రకరకాల ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫొటో ఓ మధుర జ్ఞాపకం.. కానీ, అలాంటి కొన్ని పాత మధుర జ్ఞాపకాలు మసకబారిపోతుంటాయి. కొన్నేండ్ల క్రితం నాటి ఫొటోలు ఇంట్లో చాలానే ఉంటాయి. అయితే వాటి డిటెయిల్స్ పాడయ్యి, ఇమేజ్ మసకబారి ఉంటుంది. అలాంటి ఫొటోల క్లారిటీ పెంచడానికి రకరకాల టూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాత ఫొటోలకు కొత్త మెరుగులు దిద్దేలా రకరకాల ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మీకు అత్యంత ముఖ్యమైన ఫొటోలను క్వాలిటీ పెంచుకుని దాచుకోవచ్చు. అంతేకాదు ఈ టూల్స్‌తో పాత ఫొటోలను హెచ్డీ క్వాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.
పాత ఫొటోల రీక్రియేట్ చేసే టూల్స్‌లో ‘రెమినీ. ఏఐ(remini.ai)’ ఒకటి. ఈ సైట్‌లో పాత ఫొటోలను క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేస్తే చాలు. ఒక్క క్లిక్‌తో పాత ఫొటోలు కొత్తగా మారతాయి. ఈ టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పిక్సెల్స్‌ను రీడ్ చేసి వాటిని సరిచేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్, ఫేస్‌ని డిటెక్ట్ చేసి.. కలర్ కరెక్షన్ కూడా ఆటోమెటిక్‌గా చేసేస్తుంది.
‘రిమూవల్. ఏఐ(removal.ai)’ అనే మరో టూల్ సాయంతో పాడైపోయిన పాతఫొటోలను కొత్తగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫొటోని సైట్‌లో అప్‌లోడ్ చేసి అందులో అవసరం లేని వస్తువులను లేదా బ్యాక్‌గ్రౌండ్ వంటివి రిమూవ్ చేయొచ్చు.
‘వ్యాన్సీ ఏఐ(vanceai.com)’ అనే మరో టూల్ పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను కలర్ ఫొటోలుగా మార్చుకోవచ్చు. ఫొటోలను సైట్‌లో అప్‌లోడ్ చేసి ‘ఎన్‌హాన్స్ ఓల్డ్ ఫొటోస్’ అనే ఆప్షన్ ద్వారా ఫొటోకి కొత్తగా రంగులు దిద్దొచ్చు. అలాగే ఇందులో ఆటో రిపేర్, ఫేస్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ వంటి పలు ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
‘ఫొట్ ఏఐ(phot.ai)’ అనే మరో ఏఐ టూల్ సాయంతో గీతలు పడిన పాత బ్లాక్ అండ్ ఫొటోలను ఇప్పటి కెమెరాలతో తీసిన ఫొటోలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫొటోకి కలర్ ఇవ్వడంతో పాటు గీతలు, స్క్రాచెస్ వంటివి కూడా రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇందులో ఫొటో కలరైజర్, ఇమేజ్ అప్‌స్కేలర్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.