వాట్సాప్‌లో కొత్తరకం మోసం.. ఇలా జాగ్రత్త పడండి!

ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రకరకాల కొత్త స్కామ్స్‌తో డబ్బు దోచుకుంటున్నారు. తాజాగా యూఎస్ అధికారుల్లా కాల్స్ చేస్తూ కొత్త రకం మోసానికి తెర లేపారు.

Advertisement
Update:2023-08-30 11:00 IST

వాట్సాప్‌లో కొత్తరకం మోసం

ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రకరకాల కొత్త స్కామ్స్‌తో డబ్బు దోచుకుంటున్నారు. తాజాగా యూఎస్ అధికారుల్లా కాల్స్ చేస్తూ కొత్త రకం మోసానికి తెర లేపారు. వివరాల్లోకి వెళ్తే..

దాదాపు అందరి మొబైల్స్‌లో కనిపించే కామన్ యాప్.. వాట్సాప్. అందుకే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మోసాలు చేస్తున్నారు. గతంలో ఫేక్ అకౌంట్స్ ద్వారా అలెర్ట్స్ పంపడం, ఫ్రెండ్స్‌లా నటించి మోసం చేయడం వంటి స్కామ్స్ చేశారు. ఇప్పుడు అమెరికాకు చెందిన అధికారుల్లా నటిస్తూ వాట్సాప్ వేదికగా మోసాలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఉద్యోగులుగా లేదా కంపెనీ సీఈఓలుగా నటిస్తూ యూజర్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన ఫేక్ ఫోన్‌ నంబర్ల ద్వారా ఈ మోసాలు చేస్తున్నట్టు సైబర్ అధికారులు గుర్తించారు.

స్కామ్ ఎలా ఉంటుందంటే..

ముందుగా విదేశాల్లో ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్లను, విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవాళ్లను ట్రాక్ చేసి.. వాళ్లకు వాట్సాప్‌లో ‘మీ అప్లికేషన్ ప్రాసెస్ అయింది.ఈ మెసేజ్‌ చూశాక ఫోన్‌ చేయండి’ అంటూ అఫీషియల్ మెసేజ్‌లా కనిపించే ఫేక్ మెసేజ్ వస్తుంది. దానికి రిప్లై ఇచ్చినా లేదా ఆ నెంబర్‌‌కు ఫోన్ చేసినా.. ఇక అంతే సంగతి. జాబ్ ఆఫర్ లేదా ఎడ్యుకేషన్‌లోన్ అంటూ మాటలతో మాయ చేసి డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తారు. లేదా ‘లింక్ పై క్లిక్ చేయండి’ అంటూ.. మాల్వేర్‌‌తో కూడిన లింక్స్ పంపిస్తారు. అవి క్లిక్ చేస్తే మన డేటా వారి చేతుల్లోకి వెళ్లడం ఖాయం.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. వాట్సాప్‌లో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ పోలీసులు. తెలియని నెంబర్ల నుంచి ఏదైనా లింక్‌ వస్తే.. క్లిక్ చేయకుండా ఆ అకౌంట్‌ను వెంటనే బ్లాక్‌ చేయాలి. వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. వాట్సాప్‌కు ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ ఆన్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసుల్లో ఉండే ఫ్రీ వై-ఫైని వాడుకోకపోవడమే మంచిది. ఏవైనా అనుమానాస్పద కాల్స్, మెసెజ్‌లు వస్తే సైబర్ పోలీసులను సమాచారం ఇవ్వాలి.

Tags:    
Advertisement

Similar News