ఓటర్ల కోసం ఆరు యాప్స్! ఎలా పనిచేస్తాయంటే..

ఎన్నికల టైంలో ఓటర్లకు మరింత అవగాహన కల్పించేందుకు ఎలక్షన్ కమీషన్ ఆరు రకాల యాప్స్ తీసుకొచ్చింది.

Advertisement
Update:2023-10-25 08:00 IST

ఓటర్ల కోసం ఆరు యాప్స్! ఎలా పనిచేస్తాయంటే..

ఎన్నికల టైంలో ఓటర్లకు మరింత అవగాహన కల్పించేందుకు ఎలక్షన్ కమీషన్ ఆరు రకాల యాప్స్ తీసుకొచ్చింది. ఇవి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు, ఓటర్ల లిస్ట్‌లో పేర్లు నమోదుచేసుకునేందుకు.. ఇలా రకరకాలుగా ఉపయోగపడతాయి.

ఎన్నికల సమయంలో జరిగే చట్ట వ్యతిరేకమైన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎలక్షన్ కమీషన్ ‘సీ విజిల్’ అనే యాప్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లో ఓటర్లు ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధంగా జరిగే పనులను వీడియో లేదా ఫొటో తీసి కంప్లెయింట్ చేయొచ్చు.

కేవైసీ యాప్

‘నో యువర్ క్యాండిడేట్(కేవైసీ)’ పేరుతో ఎన్నికల కమిషన్ ఓ యాప్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఒటర్లు అభ్యర్థులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందొచ్చు. అభ్యర్థి క్రైమ్ హిస్టరీ, ఆస్తుల వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వంటి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఓటర్ హెల్ప్ లైన్

ఓటర్ లిస్ట్‌లో పేరు నమోదు చేసుకోవడం, పేరు, చిరునామా వంటివి సవరించుకోవడం, ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడం వంటి అన్నిరకాల సేవల కోసం ‘ఓటర్ హెల్ప్ లైన్’ అనే యాప్‌ను అందుబాటులో ఉంచింది ఎలక్షన్ కమీషన్. ఈ యాప్ సాయంతో ఎక్కడికీ వెళ్లేపని లేకుండా ఇంటి నుంచే ఓటరు ఐడీని పొందొచ్చు. వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

సాక్షం

దివ్యాంగ ఓటర్ల కోసం ఎలక్షన్ కమీషన్ ‘సాక్షం’ అనే యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా దివ్యాంగులు ఇంటి నుంచే ఓటర్ రిజిస్ట్రేషన్, సవరణల వంటివి చేసుకోవచ్చు. ఓటు వేయడానికి వెళ్లేందుకు వీల్ చైర్ కావాలని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి నుంచి పోలింగ్ బూత్‌కు పికప్, డ్రాపింగ్ వంటి సదుపాయాలు కావాలని అప్లై చేసుకోవచ్చు.

క్యాండిడేట్ యాప్

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఎలక్షన్ కమీషన్ క్యాండిడేట్ అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ద్వారానే నామినేషన్‌ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. యాప్‌లోకి లాగిన్ అయ్యి అఫిడవిట్ వేయొచ్చు. ఎన్నికల ప్రచారం కోసం పర్మిషన్స్ వంటివి అప్లైచేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News