5G Smartphones | స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. రూ.15 వేల లోపు ధర కల బెస్ట్ ఫోన్లు ఇవే..!
5G Smartphones | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు కూడా ముందుకేయలేం.. ఇంటర్నెట్ కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.
5G Smart Phones | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు కూడా ముందుకేయలేం.. ఇంటర్నెట్ కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. రోజురోజుకు కనెక్టివిటీ పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు 5జీ కనెక్టివిటీ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పండుగల సీజన్‌లో మీరు కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అదీ రూ.15 వేల లోపు బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారా.. బడ్జెట్ ధరతోపాటు ఫీచర్లు, కనెక్టివిటీ కెపాసిటీని బట్టి ఇష్టమైన స్మార్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు.. అవేమిటో ఓ లుకేద్దామా..
బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ పోకో ఎం6 ప్రో 5జీ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) భారత్ మార్కెట్లోకి పొకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) ఫోన్ ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీన ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 4 Gen 2 processor)తో వస్తోందీ ఫోన్. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరా) ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా జత చేశారు.
పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కొనుగోలుదారులు 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్‌లో రూ.11,999, అమెజాన్‌లో రూ.12,495 నుంచి ప్రారంభం అవుతుంది.
ఒక్టాకోర్ ఎక్స్‌నోస్ 1330 ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ
శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G) ఫోన్‌ను ఏడు నెలల క్రితం భారత్ మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ ఫోన్ ఒక్టాకోర్ ఎక్స్‌నోస్ 1330 (octa-core Exynos 1330) ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఫోటో గ్రఫీ కోసం ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంది.
పవర్ బ్యాకప్ కోసం 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కొనుక్కోవాలంటే 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,998, అమెజాన్‌లో రూ.12,039ల నుంచి ప్రారంభం అవుతుంది.
రూ.10 వేల లోపు లావా బ్లేజ్2 5జీ లభ్యం
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) ఈ నెల రెండో తేదీన లావాబ్లేజ్2 5జీ (Lava Blaze 2 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 (MediaTek Dimension 6020) ప్రాసెసర్‌తో వస్తున్నది. ఫోటోగ్రఫీ కోసం 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్‌లతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది.
18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో లావా బ్లేజ్2 5జీ (Lava Blaze 2 5G) ఫోన్ వస్తుంది. కొనుగోలుదారులకు లావా బ్లేజ్2 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రూ.9,999లకు లభిస్తుంది.
బడ్జెట్ ధరలోనే రియల్‌మీ11ఎక్స్ 5జీ
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 11ఎక్స్ 5జీ (Realme 11x 5G) ఫోన్ గత ఆగస్టు 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ (MediaTek Dimension 6100+)తో వస్తుంది. 64 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా వస్తుంది. పవర్ బ్యాకప్ కోసం 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది
పవర్ బ్యాకప్ కోసం 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. రియల్‌మీ 11ఎక్స్ 5జీ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతోపాటు పర్పుల్ డాన్, మిడ్‌నైట్ కలర్ రూ.14,999, రియల్‌మీ 11ఎక్స్ 5జీ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతోపాటు పర్పుల్ డాన్, మిడ్‌నైట్ కలర్ రూ.15,999 లకు లభిస్తుంది.
రూ.13 వేల లోపు ధరకే రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్ గత సెప్టెంబర్ ఆరో తేదీన మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + (MediaTek Dimensity 6100+) ప్రాసెసర్‌తో వస్తోంది. 50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా వస్తుంది.
పవర్ బ్యాకప్ కోసం 33 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.11,749, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,440 నుంచి ప్రారంభం అవుతుంది.
రూ.12 వేల లోపే నోకియా జీ42 5జీ
దేశీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా (Nokia) తన నోకియా జీ42 5జీ (Nokia G42 5G) ఫోన్ గత సెప్టెంబర్ 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని లాంచింగ్ ధర రూ.12,599. ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ.11,999లకే అందుబాటులో ఉంటుంది. మెరుగైన పనితీరు కోసం క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్ (Qualcomm Snapdragon 480+)తో వస్తున్నది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2 మెగా పిక్సెల్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలతోపాటు సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటే 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
రూ.13 వేల లోపే రెడ్‌మీ12 5జీ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ12 5జీ (Redmi 12 5G) స్మార్ట్ ఫోన్‌ను గత ఆగస్టు ఒకటో తేదీన ఆవిష్కరించింది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 4 Gen 2) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2 మెగా పిక్సెల్ సెన్సర్‌తో డ్యుయల్ రేర్ కెమెరా ప్యానెల్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
పవర్ బ్యాకప్ కోసం ఫోన్ 22.5 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. కొనుగోలుదారులు 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌లో రూ.11,999 నుంచి, ఫ్లిప్ కార్ట్‌లో రూ.12,598 నుంచి ప్రారంభం అవుతాయి.
మోటో జీ54 5జీ ఫోన్ ధర ఎంతంటే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) గత సెప్టెంబర్ ఆరో తేదీన మోటో జీ54 5జీ (Moto G54 5G) ఫోన్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్షన్ 7020 (MediaTek Dimension 7020) ప్రాసెసర్ తో పని చేస్తుంది. మోటో జీ54 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా (50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగా పిక్సెల్ సెన్సర్) సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటది.
పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్లోకి వస్తున్నది.ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌లో 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ రూ.15,999లకు లభిస్తుంది.