ఎమ్మెల్సీ కవితకు తమిళనాడు సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు
గ్రీటింగ్స్ చెప్తూ లేఖ రాసిన స్టాలిన్
ఎమ్మెల్సీ కవితకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ప్రత్యేకంగా ఆయన కవితకు లేఖ రాశారు. ఆ లేఖలో నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మూడు పేజీలతో కూడిన గ్రీటింగ్ కార్డు మొదటి పేజీలో తమిళనాడు ప్రభుత్వ రాజముద్రతో పాటు తమిళంలో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అని రాసి ఉంది. రెండో పేజీలో న్యూ ఇయర్ తో పాటు పొంగల్ గ్రీటింగ్స్ చెప్తూ సీఎం స్టాలిన్ సంతకం ఉంది. మూడో పేజీలో కన్యాకుమారిలోని తిరువల్లూరు స్టాట్యూ (స్టాట్యూ ఆఫ్ విజ్డమ్) ఫొటో ప్రింట్ చేసి ఉంది. తనకు నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన స్టాలిన్ కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ స్టాలిన్ కు ఆమె ప్రత్యుత్తరం రాశారు.