సంక్రాంతికి ఆరు ప్రత్యేక రైళ్లు

రేపటి నుంచి టికెట్ల బుకింగ్‌

Advertisement
Update:2025-01-01 19:41 IST

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపతుంది. కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌ కు వెళ్లే ప్రత్యేక రైలు ఈనెల 9న సాయంత్రం 8.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడుకు చేరుకుంది. అదే ట్రైన్‌ 10వ తేదీన మధ్యాహ్నం 3,10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాచిగూడ నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి కాచిగూడకు మొత్తం నాలుగు ట్రిప్పులుగా ఈ రైలును నడుపుతున్నారు. 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌ (నాంపల్లి) నుంచి బయల్దేరే మరో ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ కు చేరుకుంటుంది. 11న కాకినాడ నుంచి సాయంత్రం 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 8.30 గంటలకు హైదరాబాద్ కు తిరిగి వస్తుంది. కాచిగూడ నుంచి నడిపే ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా కాకినాడకు చేరుకుంటుంది. హైదరాబాద్‌ నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్‌ల మీదుగా కాకినాడకు చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2టైర్‌, 3 టైర్‌, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ బోగీలు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News