కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి

కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది అన్న ఏపీ సీఎం

Advertisement
Update:2025-01-15 09:05 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం మనకు బోధిస్తుందని చెప్పారు. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది అని పేర్కొన్నారు. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వివరించారు. 

Tags:    
Advertisement

Similar News