ఇకపై ట్విట్టర్'పే'.. డిజిటల్ పేమెంట్ల రంగంలోకి మస్క్

ఇకపై ఎవరైనా మీకు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, వాట్సప్ పే ఉందా అని అడగడంతోపాటు ట్విట్టర్ పే ఉందా అని కూడా అడగొచ్చు. ట్విట్టర్లో డబ్బులు పంపాను ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అనే మాటలు కూడా మనం త్వరలో వినొచ్చు.

Advertisement
Update:2022-11-11 08:09 IST

ట్విట్టర్ కేవలం మెసేజ్ లు పంపించుకోడానికి, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్ లు పోస్ట్ చేసుకోడానికి మాత్రమే కాదు, ఇకపై డబ్బులు పంపుకోడానికి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడబోతోంది. వాట్సప్ పే లాగే, ట్విట్టర్ కూడా పేమెంట్ల రంగంలోకి దిగింది. ఇకపై ఎవరైనా మీకు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, వాట్సప్ పే ఉందా అని అడగడంతోపాటు ట్విట్టర్ పే ఉందా అని కూడా అడగొచ్చు. ట్విట్టర్లో డబ్బులు పంపాను ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అనే మాటలు కూడా మనం త్వరలో వినొచ్చు.

ట్విట్టర్ ని బ్రహ్మాండమైన ఆదాయ వనరుగా చూస్తున్న మస్క్ ప్రతి దానికీ లెక్క కడుతున్నాడు. బ్లూటిక్, అఫిషియల్ లేబుల్ అంటూ సబ్ స్క్రిప్షన్ చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్లవైపు చూస్తున్నాడు. గతవారం అమెరికా యంత్రాంగం వద్ద దీనికి సంబంధించిన పేపర్‌ వర్క్‌ అంతా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిజిటల్‌ పేమెంట్లపై అడ్వర్టెజర్లతో కూడా ఆయన సమావేశమయ్యారు. వాటిని కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సాధారణ బ్యాంక్ అకౌంట్లతోపాటు ట్విట్టర్లో కూడా డబ్బులు నిల్వ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. మిగతా బ్యాంక్ అకౌంట్లకంటే ట్విట్టర్ అకౌంట్లో నిల్వ చేసుకునే సొమ్ముపై అధిక వడ్డీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట మస్క్. అయితే గూగుల్ పే, ఫోన్ పే లాగా.. వాట్సప్ పే అంత ఫేమస్ కాలేదు. మరి దీన్ని ట్విట్టర్ అధిగమిస్తుందేమో చూడాలి.

ఉద్యోగులకు కొరడా..

ఇప్పటికే సగం మంది ఉద్యోగుల్ని పీకేసిన మస్క్, ఇప్పుడు ఉన్నవారిపై ఒత్తిడి పెంచబోతున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దని తేల్చి చెప్పాడు. ఏ ఉద్యోగి అయినా సరే వారానికి 40గంటలు ఆఫీస్ కి రావాల్సిందేనంటున్నాడు. ట్విట్టర్‌ రెవెన్యూను 50 శాతం పెంచేలా ఉద్యోగులు కష్టపడాలని మస్క్ మెయిల్ చేశాడు. గతంలో ట్విట్టర్లో ఉద్యోగం అంటే ఎగిరి గంతేసేవారు. కానీ ఇప్పుడు మస్క్ ఆఫీస్ లో పనా అంటూ అందరూ షాకవుతున్నారట.

Tags:    
Advertisement

Similar News