కాసుల వ‌ర్షం కురిపిస్తున్న క‌ల్కి.. తొలి రోజే ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్‌

నైజాంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఫస్ట్‌ డే రూ.23.55 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ ను రాబట్టగా.. కల్కి 2898 ఏడీ రూ.24 కోట్లు వ‌సూల్ చేసి ఆ రికార్డును చిత్తు చేసింది.

Advertisement
Update: 2024-06-28 09:21 GMT

నిన్నటి నుంచి ప్రతి నోటా కల్కి మాటే వినిపిస్తోంది. పురాణాలకు సైన్స్ ముడిపెట్టి యూనిక్‌ స్టోరీ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గురువారం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండడం.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ కాస్ట్ భాగం అవ్వడంతో ప్రేక్ష‌కులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.

రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లోనూ ప్ర‌భాస్ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేష‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. దీంతో క‌ల్కి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో తొలి రోజు వ‌సూళ్ల ప‌రంగా ఊచ‌కోత కోయ‌డ‌మే కాకుండా ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసి ప‌డేసింది. నైజాంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఫస్ట్‌ డే రూ.23.55 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ ను రాబట్టగా.. కల్కి 2898 ఏడీ రూ.24 కోట్లు వ‌సూల్ చేసి ఆ రికార్డును చిత్తు చేసింది.

ఇక‌పోతే ఇండియాతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ క‌ల్కి ఫీవర్ న‌డుస్తోంది. నార్త్ అమెరికన్‌ ప్రీమియర్స్‌లో ఆర్ఆర్ఆర్ పేరిట‌ ఉన్న రికార్డును సైతం ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి చిత్రం అధిగమించింది. ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్స్ లో 3.8 మిలియ‌న్ డాల‌ర్ల‌ తో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఇండియ‌న్ మూవీగా క‌ల్కి అగ్రస్థానంలో నిలిచింది. 3.46 మిలియ‌న్ డాల‌ర్ల‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక పీమియ‌ర్స్ మ‌రియు మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ క‌లిపి అమెరికాలో క‌ల్కి 5 మిలియ‌న్ డాల‌ర్ల‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News