సాధ్విగానే కొనసాగుతా
మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలుగుతున్న : మమతా కులకర్ణి
Advertisement
కిన్నర్ అఖాడాలో తాను సాధారణ సాధ్విగానే కొనసాగుతానని బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి అలియాస్ మాయీ మమతానంద్ గిరి ప్రకటించారు. అఖాడాలో మహా మండలేశ్వర్ పదవి నుంచి తాను వైదులుగొతుతున్నానని ఆమె స్పష్టం చేశారు. అఖాడాలో చేరిన స్వల్పకాలంలో మమతా కులకర్ణికి అత్యున్నత స్థానం ఇవ్వడంపై పలువురు అఖాడాలు, గురువులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐహిక సుఖాల్లో మునిగిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులు మారిపోయి మహామండలేశ్వర్ లాంటి స్థాయికి చేరడం ఏమిటని ప్రశ్నించారు. ఇదికాస్తా కిన్నర్ అఖాడా వ్యవస్థాపకుడు అజయ్ దాస్, గురువు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. ఈ వివాదాలు కాస్త భగ్గుమనడంతో మమతా కులకర్ణి తాను సాధ్విగానే కొనసాగుతానని ప్రకటించారు.
Advertisement