మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
సీఎం రాజీనామాకు గవర్నర్ అజయ్ భల్లా ఆమోదం
మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు స్వయంగా అందించారు. గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. సీఎం అల్లుని నివాసం సహా ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపైనా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బీరెన్ సింగ్ రాజీనామా చేసినట్లు సమాచారం. సింగ్ రాజీనామాను, ఆయన మంత్రి మండలి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు బీరేన్ సింగ్ పదవిలో కొనసాగుతారు.మణిపూర్ జాతుల మధ్య అల్లర్లు కొనసాగుతున్నందున రాజీనామా చేశారు. 2023మేలో రాష్ట్రంలో జాతి హింస చెలరేగినప్పటి నుంచి 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.మణిపూర్‌లో త్వరలో రాష్ట్రపతి పాలన విధించనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.