ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా.. అసెంబ్లీ రద్దు
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ రిజైన్ చేశారు
Advertisement
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ రాజీనామా చేశారు. రిజైన్ లేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ వి.కె సక్సేనాకు అందజేశారు. కాగా నిన్న వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ పార్టీ ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్ధానాలు గెలుచుకొని అధికారం చేపట్టింది.అతిషి రాజీనామా అనంతరం ఎల్జీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఢిల్లీ 7వ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌పై గెలిచిన పర్వేష్ వర్మకే సీఎం పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.
Advertisement