భారతదేశంలో అండర్ ట్రయల్ ఖైదీలు 66% మంది అణగారిన కులాల నుండే ఎందుకు ఉన్నారు? (2022 రిపోర్ట్)

భారతదేశం యొక్క బెయిల్ వ్యవస్థ అసమర్థతను నొక్కి చెబుతూ, 'జైలు కాదు బెయిల్' అనే సూత్రం ప్రమాణంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.అండర్ ట్రయల్ ఖైదీలతో జైళ్ళు కిక్కిరిసిపోయి చట్టపరమైన సూత్రాలకు విరుద్ధంగా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Advertisement
Update:2022-12-26 08:28 IST

భారత జైళ్లలో ఉన్న 5 గురు అండర్ ట్రయల్ ఖైదీలలో ముగ్గురు దళితులు, ఆదివాసీలు,OBC వర్గాలకు చెందినవారు అని తాజా ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ (2021) తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదిక ప్రకారం 5,54,034 మంది ఖైదీల్లో 4,27,165 మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారని 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా డిసెంబర్ 13న చెప్పారు. అంటే మొత్తం ఖైదీల్లో 76% మంది అండర్ ట్రయల్ ఖైదీలే.

ఖైదు చేయబడి, విచారణలో ఉన్నవారిలో 66% మంది అట్టడుగు వర్గాల ప్రజలు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అండర్ ట్రయల్ ఖైదీలు అంటే కేవలం నిందితులు మాత్రమే అంటే వారిపై పేర్కొన్న అభియోగాలు ఇంకా రుజువు కాలేదు. వారు ఇప్పటికీ, అక్షరాలా, 'విచారణలో' మాత్రమే ఉన్నారు.

విచారణలో ఉన్నప్పుడు జైలులో ఉండవలసిన అవసరం ఏమిటి?

సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులో (సతేందర్ కుమార్ యాంటీల్ వర్సెస్ సీబీఐ, జూలై 2022) దీనికి సమాధానం ఇచ్చింది.

భారతదేశం లో బెయిల్ మంజూరు వ్యవస్థ అసమర్థతను నొక్కి చెబుతూ, 'జైలు కాదు బెయిల్' అనే సూత్రం ప్రమాణంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.అండర్ ట్రయల్ ఖైదీలతో జైళ్ళు కిక్కిరిసిపోయి ఉండటం చట్టపరమైన సూత్రాలకు విరుద్ధంగా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

జైళ్ళలో రద్దీ గురించి కోర్టు ఆందోళనలు నిరాధారమైనవి కావు - తాజా (2021) ఆక్యుపెన్సీ రేటు 130.2% గా ఉంది. అంటే జైళ్ళలో ఉండాల్సిన వారికన్నా 30 శాతం ఎక్కువ మంది ఉన్నారు. ఇది మునుపటి సంవత్సరంలో 118%గా ఉంది.

దోషులుగా నిర్ధారించబడకుండా, ఎక్కువ కాలం జైళ్లలో మగ్గుతున్న వ్యక్తుల గురించి సుప్రీం కోర్టు భయాలు సహజమైనవి.

నివేదిక ప్రకారం:

70.9% అండర్ ట్రయల్ ఖైదీలు 1 సంవత్సరం వరకు నిర్బంధించబడ్డారు,

13.2% 1 నుండి 2 సంవత్సరాల వరకు,

7.6% 2 నుండి 3 సంవత్సరాల వరకు ,

2.7% మంది 5 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారు

అట్టడుగు కులాల వారే ఎక్కువ సంఖ్యలో ఎందుకు అండర్ ట్రయల్ గా ఉన్నారు?

అండర్ ట్రయల్ ఖైదీలలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాలకు చెందినవారే కావడం వ్యవస్థ స్వాభావిక పక్షపాతాన్ని ప్రతిబింబిస్తుంది" అని అస్సాంలో ఉన్న ఒక న్యాయ సహాయ సంస్థకు చెందిన అబాంటీ దత్తా ఓ ప్రముఖ వెబ్ సైట్ తో చెప్పారు.

ప్రాజెక్ట్ 39A, న్యూఢిల్లీకి చెందిన ఖైదీల హక్కుల న్యాయవాదుల గ్రూపు, వారి వెబ్‌సైట్‌లో దీనిని మరింత వివరించారు.

1) ఒక వ్యక్తిని అరెస్టు చేయడం తప్పని సరి అవసరం అని సమర్థించబడుతోంది, కోర్టులో వారిని నిలబెట్టడం, కోర్టులో వారి ఉనికిని నిర్ధారించడం అవసరమని పోలీసులు విశ్వసిస్తున్నారు. ఇటువంటి అస్పష్టమైన సమర్థనలు ఏకపక్ష అరెస్టులకు దారితీయవచ్చు.అంతే కాదు అట్టడుగున ఉన్న ప్రజలను చాలా ప్రమాదంలో పడేస్తాయి.

2) అండర్ ట్రయల్ ఖైదీ బెయిల్ పొందినప్పటికీ షరతుల కారణంగా బైటికి రాలేక జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. ఉదాహరణకు, అట్టడుగు వర్గాలకు చెందినవారు తరచుగా డబ్బు/ఆస్తి, స్థానిక పూచీకత్తులను ఏర్పాటు చేయలేరు. ఫలితంగా, వారు బెయిల్ పొందిన తర్వాత కూడా చాలా కాలం జైలులోనే ఉంటారు.

ఈ సంఖ్యలు వ్యవస్థ యొక్క‌ 'స్వాభావిక పక్షపాతాన్ని' ప్రతిబింబిస్తాయి.2022 సంవత్సరంలో మాత్రమే కాకుండా, అనేక ఏళ్ళుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత ఐదేళ్లలో (2017 - 2021) అట్టడుగు వర్గాల నుండి అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య 48 శాతం పెరిగిందని డాటా సూచిస్తుంది.

Tags:    
Advertisement

Similar News