డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌!

నేడు ప్రమాణం..మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సీఎం పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ ఆర్‌.ఎస్‌. రవి శనివారం ఆమోదం

Advertisement
Update:2024-09-29 07:52 IST

తమిళనాడు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తనయుడు ఆ రాష్ట్ర యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ ఆర్‌.ఎస్‌. రవి శనివారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ప్రకటన విడుదల చేసింది.

నేడు (ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు చైన్నైలో ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి, ఇటీవల విడుదలైన మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీని మళ్లీ క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. అదేవిధంగా డాక్టర్‌ గోవి. చెళియన్‌, ఆర్‌. రాజేంద్రన్‌, ఎస్‌ఎం నాజర్‌లనూ కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. మనో తంగరాజ్‌ సహా ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. 

Tags:    
Advertisement

Similar News