రామ నవమి ర్యాలీలలో హింసాత్మక సంఘటనల తర్వాత, బెంగాల్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు, ఇళ్ళకు నిప్పు... ఉద్రిక్తం

గురువారం నాటి హింసను పోలీసులు అణిచివేసిన తర్వాత‌ , శుక్రవారం కొన్ని గుంపులు పలు భవనాలు, వాహనాలపై దాడి చేయడం, కొన్నింటికి నిప్పంటించడం, రాళ్లు రువ్వడం వంటి తాజా ఘర్షణలు జరిగాయి.

Advertisement
Update:2023-04-01 21:14 IST

హౌరా వీధుల్లో రామనవమి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింస, పశ్చిమ బెంగాల్‌లోని దాల్‌ఖోలాలో జరిగిన‌ హింస‌లో ఒకరు మరణించిన ఒక రోజు తర్వాత బెంగాల్ లో ఉద్రిక్తలు మరింత పెరిగాయి.

గురువారం నాటి హింసను పోలీసులు అణిచివేసిన తర్వాత‌ , శుక్రవారం కొన్ని గుంపులు పలు భవనాలు, వాహనాలపై దాడి చేయడం, కొన్నింటికి నిప్పంటించడం, రాళ్లు రువ్వడం వంటి తాజా ఘర్షణలు జరిగాయి.

ఉత్తర దినాజ్‌పూర్‌లో ఘర్షణల సమయంలో ఒక యువకుడు గుండెపోటుతో మరణించాడని, దల్‌ఖోలా పట్టణంలో హింసను అరికట్టడానికి ప్రయత్నించిన ఆరుగురు పోలీసులు గాయపడ్డారని మీడియా నివేదించింది.

పంచాయితీ ఎన్నికలకు ముందు బలాన్ని చూపించేందుకు టిఎంసి, బీజేపీ లు రామనవమి ఊరేగింపులను అవకాశంగా తీసుకున్నాయని స్థానిక మీడియా నివేదించింది. హౌరా సహా అనేక ర్యాలీల్లో రామనవమి ర్యాలీల్లో పాల్గొన్న వారు ఆయుధాలతో ఉన్నారని మీడియా తెలిపింది.

ర్యాలీల్లో పలువురు ఆయుధాలతో ఉన్న వీడియోలను, ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్, జాతీయ ప్రధాన కార్యదర్శి, బెనర్జీ మేనల్లుడు అభిషేక్ లు ట్విట్టర్ లో షేర్ చేశారు. వారంతా బీజేపీ కార్యకర్తలని ఆరోపించారు.


బీహార్‌లో కూడా ఘర్షణలు , దాడులు జరిగాయి. ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో రామనవమి వేడుకల తరువాత పెద్ద ఎత్తున దాడులు , ఘర్షణలు జరిగాయి. అనేక షాపులను, వాహనాలను తగలబెట్టారు. రాళ్ళ దాడికి పాలడ్డారు. బీహార్ షరీఫ్ లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. 

Tags:    
Advertisement

Similar News