పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు..బడ్జెట్ ఎప్పుడంటే ?
జనవరి 31వ తేదీన పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 31నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి1న కేంద్రం ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత రెండో విడత మొదలు కానున్నాయి.
మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి.జనవరి 31 ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది కేంద్రం. ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.