మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
ఒక్క గురువారం రోజునే 30 లక్షల మంది మహాకుంభమేళా హజరయ్యారన్న యూపీ ప్రభుత్వం
Advertisement
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఐదోరోజు భక్తులు పోటెత్తుతున్నారు. తీవ్రమైన చలిలోనూ ఉదయం నుంచే ఘాట్ ల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా మొదలైన నాటి నుంచి త్రివేణి సంగమంలో ఇప్పటివరకు 7 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఒక్క గురువారం రోజునే 30 లక్షల మంది మహాకుంభమేళా హజరయ్యారని పేర్కొన్నది. మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
Advertisement