నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు : నితిన్ గడ్కరీ

నాసిరకం రోడ్ల నిర్మాణాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Advertisement
Update:2025-01-17 14:34 IST

దేశంలో నాసిరకం రోడ్డులు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని కేంద్ర మంత్రి రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సంబంధిత రాయితీదారులను ఇందుకు బాధ్యులను చేసి వారిని జైలుకు పంపించాలని గడ్కరీ హెచ్చారించారు. రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్ధానం ఉందని మంత్రి గడ్కరీ అన్నారు. ఇక నుంచి నాసిరకం రోడ్ల నిర్మాణాలను చేపడితే ఆ విషయాన్ని తాము నేరంగా పరిగణిస్తామని అన్నారు.

దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను 2030 నాటికి సగానికి తగ్గించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2023లో రోడ్డు ప్రమాదాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం 5 లక్షలకు పైగా ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఫలితంగా 1,72,000 మంది ప్రాణాలు కోల్పోయారని, మరణాల రేటు 66.4 శాతంగా ఉందన్నారు. అందులో 1,14,000 మంది 18 నంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గలవారు కాగా, 10 వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని గడ్కరీ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News