ఆరు రోజులు నుంచి బోరుబావిలోనే చిన్నారి..కాపాడాలని తల్లి రోదన
బోరుబావిలో చిన్నారిని బయటకు తీసేందుకు దాదాపు ఆరురోజులుగా సహాయ సిబ్బంది శ్రమిస్తున్నారు.
రాజస్ధాన్‌లో పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావిలోని 150 అడుగుల వద్ద చిక్కుకున్న బాలికను బయటకు తీసేందుకు దాదాపు ఆరురోజులుగా సహాయ సిబ్బంది శ్రమిస్తున్నారు. డిసెంబర్ 23న ఘటన జరగగా.. ఇప్పటివరకు చిన్నారిని బయటకు తీయకపోవడంపై స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తెను రక్షించాలంటూ బాలిక తల్లి కన్నీరుమున్నీరులుగా విలపిస్తున్నారు. చిన్నారిని కాపాడాలని అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారుఘటనపై అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “అధికారులను ప్రశ్నిస్తే.. కలెక్టర్ మేడం సమాధానం చెబుతారని వారు అంటున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బాధిత కుటుంబసభ్యులను కలెక్టర్, ప్రభుత్వ అధికారులు పరామర్శించలేదని ఆరోపించారు. తన కుమార్తెను రక్షించాలంటూ చిన్నరి తల్లి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.