కానిస్టేబుల్ జాబ్‌కు అప్లయ్ చేసుకున్న సన్నీ లియోన్
UPPRB వెబ్ సైట్లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో ఆమెపేరు, ఫోటోలు కనిపించటమే ఇందుకు కారణం. సన్నీ లియోన్ పేరు మీదున్న దరఖాస్తు చూసి పోలీసులు షాక్ అయ్యారు. అడ్మిట్ కార్డులో సన్నీలియోన్ పేరు, ఫొటోలు ఎలా వచ్చాయి? కానిస్టేబుల్ ఉద్యోగానికి ఆమె అప్లై చేసుకోదు. అలాంటప్పుడు ఆమె పేరు, ఫొటోతో అడ్మిట్ కార్డు ఎలా తయారైంది? అని యూపీ పోలీస్ సైబర్ సెల్ దర్యాప్తు మొదలు పెట్టింది.
సన్నీలియోన్ పేరుతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తిర్వా పట్టణంలోని సోనేశ్రీ బాలికల కళాశాల కేంద్రానికి వచ్చినట్లు విచారణలో తేలింది. UPPRB వెబ్ సైట్లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మొత్తానికి కానిస్టేబుల్ దరఖాస్తుల్లో సన్నీ లియోన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక కానిస్టేబుల్ పరీక్ష కోసం 60 వేల 244 పోస్టులకు 48 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 17న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష జరగనుంది. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు యూపీ పోలీసులు.