గుజరాత్ అల్లర్ల కేసులో సెత్లవాద్ పై సిట్ చార్జి షీట్ !
ఉద్యకారిణి తీస్తా సెతల్వాద్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అహ్మదాబాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అల్లర్ల బాధితుల మధ్య అపార్థాలు వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి సెతల్వాద్ కుట్ర చేశారని కూడా ఛార్జ్ షీట్ ఆరోపించింది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఆయన కేబినెట్ సహచరులు, బీజేపీ సీనియర్ నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఉద్యకారిణి తీస్తా సెతల్వాద్ కుట్ర పన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అహ్మదాబాద్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొంది. గోద్రా అనంతర హింసాకాండకు సంబంధించి సాక్ష్యాధారాలను సృష్టించారన్న ఆరోపణలపై సెతల్వాద్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌బి శ్రీకుమార్, మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌లపై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
గుజరాత్ తమకు సురక్షితం కాదని అల్లర్ల బాధితుల మధ్య అపార్థాలు వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి సెతల్వాద్ కుట్ర చేశారని కూడా ఛార్జ్ షీట్ ఆరోపించింది.
హత్యకు గురైన కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై జూన్‌లో సుప్రీంకోర్టు మోడీతో పాటు మరో 63 మందికి క్లీన్ చిట్‌ను ఇచ్చిన రెండు రోజుల తర్వాత అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ సెతల్వాద్, తదితరులపై కేసు నమోదు చేసింది. ఆ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొంది. 2006 జూన్‌లో జాఫ్రీ దాఖలు చేసిన ఫిర్యాదు కాపీ కూడా డాక్యుమెంటరీ సాక్ష్యాలలో ఉంది. మోడీ తదితరులు ఉద్దేశపూర్వకంగానే అల్లర్లను నిరోధించలేదని ఆమె ఆరోపించారు.
ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరగనుంది.
జూన్ 26న అరెస్టయిన సెతల్వాద్ సెప్టెంబర్ 2న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె బెయిల్ దరఖాస్తును విచారిస్తున్నప్పుడు, ఆమెపైనా మరో ఇద్దరికి వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్ పై సుప్రీం కోర్టు ఆశ్చర్యంవ్యక్తం చేసింది. ఆ ఎఫ్ ఐఆర్ మోడీకి కింది కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీనే తిరిగి పేస్ట్ చేసినట్టు ఉందని నిందితులపై సరైన అభియోగాలు లేవని సుప్రీం కోర్టు పేర్కొంటూ ఆమెకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
జూన్ 26న అరెస్టయిన శ్రీకుమార్ కూడా జైల్లోనే ఉన్నాడు. అతను గుజరాత్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ కేసు సెప్టెంబర్ 28 న విచారణకు రానుంది.సంజీవ్ భట్ కస్టడీ డెత్ కేసులో పాలన్‌పూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.