సిక్కుల నకిలి ఎన్ కౌంటర్ కేసు: 43 మంది పోలీసులకు 7 ఏళ్లు జైలు శిక్ష !

1991లో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒకే రాత్రి మూడు బూటకపు ఎన్‌కౌంటర్లలో 10 మంది సిక్కులను హతమార్చినందుకు 47 మంది పోలీసులకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని నిందితులు హైకోర్టులో స‌వాల్ చేశారు. అలహాబాద్ హైకోర్టు గురువారం ఆ శిక్షను ఏడేళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ కేసులో నిందితులు హ‌త్య‌కంటే ఘోర‌మైన నేరానికి పాల్ప‌డ్డార‌ని కోర్టు పేర్కొంది.

Advertisement
Update:2022-12-16 13:59 IST

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ప‌ది మంది అమాయ‌కులైన సిక్కుల‌ను న‌కిలీ ఎన్ కౌంట‌ర్ చేసిన‌ కేసులో హైకోర్టు బెంచ్ 43 మంది పోలీసుల‌కు ఏడేళ్ళ‌ జైలు శిక్ష విధించింది. ప‌దివేల రూపాయ‌ల జ‌రిమానా చెల్లించాల‌ని కూడా ఆదేశించింది.

1991లో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒకే రాత్రి మూడు బూటకపు ఎన్‌కౌంటర్లలో 10 మంది సిక్కులను హతమార్చినందుకు 47 మంది పోలీసులకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని నిందితులు హైకోర్టులో స‌వాల్ చేశారు. అలహాబాద్ హైకోర్టు గురువారం ఆ శిక్షను ఏడేళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ కేసులో నిందితులు హ‌త్య‌కంటే ఘోర‌మైన నేరానికి పాల్ప‌డ్డార‌ని కోర్టు పేర్కొంది.

1991లో జులై 12వ తేదీన కొంద‌రు సిక్కులు బస్సులో ఫిల్బిత్ కు యాత్ర‌గా బయలుదేరారు. మార్గం మద్యలో కచ్లాఫుల్ ఘాట్ స‌మీపంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు వారి బస్సు నిలిపి 10మంది సిక్కులను కిందకు దించి పోలీసుల వాహనంలో తీసుకుని వెళ్లారు. 10 మంది సిక్కులను మూడు గ్రూపులుగా చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు అదే రోజు రాత్రి ఎన్ కౌంటర్ చేశారు.

పోస్టుమార్టం నిర్వ‌హించి మ‌రునాడు తాము ఖ‌లిస్థానీ ఉగ్ర‌వ‌దుల‌ను చంపేశామంటూ మీడియాకు చెప్పారు. ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లో పెద్ద దుమ‌రం రేపింది.

దీనిపై సిబిఐ విచార‌ణ జ‌ర‌పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. రంగంలోకిదిగిన సిబిఐ ద‌ర్యాప్తు చేసి 57 మందిపై సిబిఐ ప్ర‌త్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖ‌లు చేసింది. వీరిలో 14 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రికొంద‌రు ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యారు. అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు ఆ సిక్కుల‌ను ఎన్ కౌంట‌ర్ పేరుతో హ‌త‌మార్చింద‌ని చార్జి షీటులో పేర్కొంది. వారికి కోర్టు జీవిత‌ఖైదు విధించింది. దీనిని నిందితులు హైకోర్టులో స‌వాల్ చేశారు. అలహాబాద్ హైకోర్టులోని లక్నో ప్రత్యేక బెంచ్ ఈ కేసు విచారణ చేపట్టింది. అమాయకులైన సిక్కులను అమానుషంగా ఎన్ కౌంటర్ చేసిన 43 మంది పోలీసులకు ప్రత్యేక కోర్టు 7 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధించింది. ఇంత‌కాలానికైనా దోషుల‌కు శిక్ష ప‌డ‌డంతో త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని బాధిత సిక్కు కుటుంబాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News