బీహార్ మొకామా ఉపఎన్నికలో బీజేపీని ఓడించిన ఆర్జేడీ

బీహార్ లోని మొకామాన్ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ పై ఆర్జేడీ విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవికి 73,893 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవికి 57,141 ఓట్లు వచ్చాయి.

Advertisement
Update:2022-11-06 13:01 IST

దేశంలోని ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీహార్‌లోని మొకామాలో రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి నీలం దేవి 16,752 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీకి చెందిన సోనమ్ దేవిపై విజయం సాధించారు.

నీలం దేవికి 73,893 ఓట్లు రాగా, సోనమ్ దేవికి 57,141 ఓట్లు వచ్చాయి. బీహార్‌లో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), బహుజన్ సమాజ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బిజెపితో జెడి(యు) విడిపోయిన తర్వాత ఏర్పడిన నితీష్ కుమార్ నేతృత్వంలోని 'మహాగట్బంధన్ కు ఇది తొలి ఎన్నికల పరీక్ష. దీంట్లో ఆ కూటమి విజయం సాధించింది.

మొకామా నియోజక వర్గం నుండి బిజెపి మొదటిసారి పోటీ చేసింది, ప్రతీ సారి ఈ పార్టీ ఈ స్థానాన్ని తన మిత్రపక్షాలకు వదిలిపెట్టింది. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి మధ్య తీవ్ర పోటీ జరిగింది. నీలమ్ దేవి భర్త అనంత్ సింగ్ అనర్హత వేటుతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మొకామా 2005 నుండి అనంత్ సింగ్‌కు బలమైన కోటగా ఉంది. అతను జెడి(యు) టిక్కెట్‌పై రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన భార్య ఆర్జేడీ టికట్ పై పోటీ చేశారు.

Tags:    
Advertisement

Similar News