రతన్‌ టాటా భారత్‌ గర్వించదగిన ముద్దుబిడ్డ

రతన్‌టాటా మృతికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ సంతాపం

Advertisement
Update:2024-10-13 07:50 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతి చెందడంతో యావత్‌ దేశం ఆయనకు నివాళులు అర్పించింది.విదేశాల్లోని ప్రముఖులు కూడా రతన్‌ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈక్రమంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ సంతాపం తెలుపుతూ.. ప్రధాని మోడీకి 'ఎక్స్‌' వేదికగా పోస్టు పెట్టారు. భారత్‌-ఇజ్రాయెల్‌ స్నేహబంధంలో టాటా కృషిని కొనియాడారు.'నేను, ఇజ్రాయెల్‌లోని అనేకమంది ప్రజలు రతన్‌ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్‌ గర్వించదగిన ముద్దుబిడ్డ. ఇరు దేశాల స్నేహబంధంలో ఆయనొక ఛాంపియన్‌. రతన్‌ కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి' అని ప్రధాని మోడీని నెతన్యాహూ కోరారు.

ఫ్రాన్స్‌-భారత్‌లోని ఆప్తమిత్రుడిని కోల్పోయిందని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ అన్నారు. 'రతన్ టాటా దూరదృష్టి, సారథ్యం.. భారత్‌, ప్రాన్స్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. రతన్‌ టాటా కుటుంబానికి, భారతీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'ను అని మాక్రాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

'భారతదేశమే కాదు.. ప్రపంచం ఒక మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయింది' అని భారత్‌లోని యూఎస్‌ దౌత్యవేత్త ఎరిక్‌ అన్నారు. తాను దౌత్యవేత్తగా నామినేట్‌ అయినప్పుడు తనకు భారత్‌ నుంచి అందిన మొదటి శుభకాంక్షలు రతన్‌ టాటావేనని గుర్తు చేసుకున్నారు. రతన్‌ టాటా తన వ్యాపారాలను సుమారు 100 దేశాలకు విస్తరించారు. అందుకే ప్రపంచనేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News