అయోధ్య రామమందిరానికి అప్పుడే పగుళ్లు!

వర్షకాలం కావడంతో రాబోయే రోజుల్లో గర్భగుడిలో పూజలు చేయడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Update: 2024-06-25 06:07 GMT

ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరానికి అప్పుడే పగుళ్లు ఏర్పడ్డాయి. పైకప్పులో లీకేజీ సమస్య త‌లెత్తింది. దీంతో గర్భగుడిలోకి నీరు చేరుతోంది. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. మొదటి వర్షానికే లీకేజీ సమస్య బయటపడింది. విషయాన్ని స్వయంగా ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మీడియాకు వివరించారు.

వర్షపు నీరు సరిగ్గా బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలోనే పైక‌ప్పు నుంచి లీక‌వుతుంద‌ని తెలిపారు పూజారి సత్యేంద్ర దాస్‌. ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవన్నారు. వర్షకాలం కావడంతో రాబోయే రోజుల్లో గర్భగుడిలో పూజలు చేయడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని లీకేజీని పరిశీలించారు. పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. మొదటి అంతస్తు నుంచి నీరు లీక‌వుతున్నట్లు గుర్తించామన్నారు మిశ్రా. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని రెండో అంతస్తు శిఖరం పూర్తయితే సమస్య ఉండదన్నారు. ప్రస్తుతం నీరు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందన్నారు మిశ్రా.

Tags:    
Advertisement

Similar News