ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ చేశారు

Advertisement
Update:2025-02-08 20:36 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికల్లో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, తమ పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. కాలుష్యం, ద్రవ్యోల్బణం, అవినీతి పైనా... ఢిల్లీ అభివృద్ధి కోసం, ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 విజయం సాధించాయి .కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.

ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి సారి బీజేపీ విజయం సాధించగా, 1998లో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ మొదటిసారి గెలిచింది. ఆనాటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇక 2013 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు పడిపోయింది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించింది

Tags:    
Advertisement

Similar News